ఇలా వంట చేస్తే మీరు ఎంత డబ్బును సేవ్ చేస్తారో తెలుసా?
చలికాలంలో వంట చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే గనుక మీరు ఎంతో డబ్బును ఆదా చేసిన వారవుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో పొద్దున్నే లేవాలంటే బద్దకంగా ఉంటుంది. చలివల్ల చాలా మంది ఈ సీజన్ లో లేట్ గా లేచి పనులను చేసుకుంటుంటారు. కానీ వంటింటి పనులను ఫాస్ట్ గా చేయడం మాత్రం కష్టం.మీకు తెలుసా? వంటింటి పనుల వల్ల మనం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే ఈ సీజన్ లో చాలా మంది వేడివేడిగానే తినాలనుకుంటారు. దీనివల్ల ఈ చలికాలంలో గ్యాస్ ను విపరీతంగా ఉపయోగిస్తారు. దీంతో గ్యాస్ రెండు నెలలు వచ్చేది నెల మాత్రమే వస్తుంది. ఇంకేముందు గ్యాస్ కే మనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం గ్యాస్ ను ఆదా చేస్తారు. మీ డబ్బును ఆదా చేస్తారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రెజర్ కుక్కర్ ను వాడాలి
చలికాలంలో ప్రెషర్ కుక్కర్ ను ఎక్కువగా వాడితే మీరు ఎంతో డబ్బును ఆదా చేసిన వారవుతారు. అన్నం వండటానికి, పప్పు, కూరలు, సూప్ మొదలైన వంటలను చేయడానికి మీరు ప్రెషర్ కుక్కర్ నే వాడండి. ఇలా చేయడం వల్ల మీ టైం చాలా వరకు ఆదా అవుతుంది. గిన్నెలో కంటే కుక్కర్ లోనే ఇవి తొందరగా అవుతాయి. అలాగే వీటివల్ల మీరు వంటింట్లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే గ్యాస్ ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది.
సిలిండర్ ను వేడి నీటిలో ఉంచండి
చలికాలంలో చాలా మంది గ్యాస్ సిలిండర్లు తొందరగా అయిపోతాయని అంటుంటుంటారు. సిలిండర్ లో గ్యాస్ ఉన్నా, మండటం లేదని మీకు అనిపిస్తే గనుక.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లను మరిగించండి. ఈ నీటిలో గ్యాస్ సిలిండర్ ను పెట్టండి. ఇలా చేస్తే వేడి వల్ల వాయువు ద్రవంగా మారి వెంటనే గ్యాస్ స్టవ్ మండుతుంది.
ఫుడ్ ను కాసెరోల్ లో ఉంచండి
చలికాలంలో వంట చేసిన తర్వాత తొందరగా చల్లబడుతుంది. ఇది కామన్. కానీ చలికాలంలో చల్లని ఆహారాలను తినాలనిపించదు. అందుకే చాలా మంది వీటిని మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. కానీ దీనివల్ల గ్యాస్ తొందరగా అయిపోతుంది. అయితే మీరు కూరలు, చపాతీలను తయారుచేసినప్పుడు వాటిని కాసెరోల్ లో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఫుడ్ ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది. మళ్లీ మీరు వేడి చేయాల్సిన అవసరం ఉండదు.
ఇలా చేయండి
చలికాలంలో టీ, పాలు లేదా నీళ్లను మరిగించినప్పుడల్లా వాటిపై మూత మూయండి. దీనివల్ల అవి తొందరగా మరుగుతాయి. అలాగే గ్యాస్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. దీంతో మీరు డబ్బును సేఫ్ చేసినట్టే.
cooking
సన్నని అడుగున్నగిన్నెలో వండండి
చలికాలంలో గ్రీన్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తింటుంటారు. అయితే మీరు వీటిని సన్నని అడుగున్న పాన్ లో వండటం అలవాటు చేసుకోండి. వీటివల్ల గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తొందరగా రెడీ అవుతుంది. దీనివల్ల మీ సమయం, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి. మీరు గ్యాస్ ను, డబ్బును ఆదా చేయాలనుకుంటే మీరు ఏ వంట చేసినా సన్నని అడుగున్న గిన్నెలోనే వండండి.