MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • జుట్టు రాలకూడదంటే... నూనె ఎలా రాయాలో తెలుసా?

జుట్టు రాలకూడదంటే... నూనె ఎలా రాయాలో తెలుసా?

తలకు రాత్రిపూట నూనె అప్లై చేస్తున్నారు అంటే మీరు దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే... మీ జుట్టురాలే సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 27 2024, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జుట్టు ఒత్తుగా పెరగాలని, ఉన్న జుట్టు రాలిపోకూడదని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దాని కోసం మార్కెట్లో దొరికే అన్ని నూనెలు, షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. జుట్టు పెరగడానికి చాలా మంది.. రాత్రిపూట తలకు నూనె రాసి.. ఉదయాన్నే తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల.. జుట్టుకు ఆయిల్ బాగా పట్టి.. మంచిగా, మృదువుగా మారుతుందని.. అనుకుంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అది నిజమే.. కానీ.. తలకు రాత్రిపూట నూనె అప్లై చేస్తున్నారు అంటే మీరు దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే... మీ జుట్టురాలే సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

35


సాధారణంగా తలకు నూనె రాసేటప్పుడు చాలా మంది.. వేడి చేసి ఆ తర్వాత అప్లై చేస్తారు. ఇది నిజంగా జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. కానీ... రాత్రిపూట నూనె రాసేటప్పుడు మాత్రం.. అలా వేడిచేసిన నూనె రాయకూడదు. ఎందుకంటే... వేడి నూనె తలకు పట్టించడం వల్ల.. చెమటలు పడతాయి.. నిద్రపోయే సమయంలో తలకు అలా చెమటలు పట్టడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి.  ఎక్కువగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అందుకే.. రాత్రిపూట మాత్రం తలకు నూనె రాయకూడదు.

45
Image: FreePik

Image: FreePik


ఇక.. జుట్టు కు నూనె రాసుకుంటే మంచిది కదా అని.. జుట్టుకు విపరీతంగా నూనె రాసేయకూడదు.  జుట్టుకు పట్టినంత నూనె మాత్రమే రాయాలి. ఎక్కువ రాయడం మంచిది కాదు. మీరు రాత్రిపూట మీ జుట్టుకు ఎక్కువ నూనెను రాసుకుంటే, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. నిజానికి ముఖానికి ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. దీన్ని చేయడానికి సులభమైన మార్గం జుట్టుకు దాని పొడవు ప్రకారం, సరిపడా నూనె మాత్రమే రాయాలి.

55

ఇక. మనకు తలకు రాసే నూనె విషయంలో... ఏ నూనె పడితే అది రాయకూడదు. జుట్టుకు సరైన నూనె ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.  వాస్తవానికి, జుట్టుకు సహజ నూనెను వాడండి. బరువుగా ఉండే నూనెను వేయవద్దు. ఇలా చేయడం వల్ల ఆయిల్ వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మీ జుట్టుకు ఏ రకమైన నూనె ఉత్తమమో తెలుసుకోవడానికి మీరు డాక్టర్ లేదా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image2
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image3
Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved