ఈ ఒక్క ఆకుతో.. ఫ్రిజ్ లో వాసన రాకుండా చేయొచ్చు
ఫ్రిజ్ లో మిగిలిపోయిన అన్నం, కూరలు, రకరకాల పండ్లు, సాస్ లు, క్రీములు ఇలా ఎన్నో ఉంటాయి. వీటి వల్లే ఫ్రిజ్ లో దుర్వాసన వస్తుంటుంది. అందుకే దీన్ని సులువుగా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చాలా మంది ఫ్రిజ్ ను ఖాళీ లేకుండా నింపేస్తుంటారు. అంటే కూరగాయలు, పండ్లు, పాలు, మిగిలిపోయిన కూరలు, మసాలాలు ఇలా ఎన్నింటినో పెడుతుంటారు. అయితే ఫ్రిజ్ వీటి వాసనలన్నింటినీ గ్రహిస్తుంది. దీనివల్ల ఫ్రిజ్ ను ఓపెన్ చేయగానే వింత వాసన వస్తుంది.
దీన్ని సకాలంలో శుభ్రం చేయకపోతే మాత్రం ఈ వాసన గది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలాగే వేడి పెరిగే కొద్ది ఈ వాసన కూడా పెరుగుతుంది. ఇది రానురాను మురికి వాసనగా మారుతుంది. అందుకే ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. అయితే ఫ్రిజ్ నుంచి వచ్చే ఈ దుర్వాసనను పోగొట్టడానికి టీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీ ఆకులతో ఫ్రిజ్ లో వాసన ఎలా పోతుంది?
టీ ఆకులు ఫ్రిజ్ లో నుంచి వచ్చే వాసనలను తొలగించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఒక టీస్పూన్ ఎండిన టీ ఆకులను ఒక చిన్న గిన్నెలో లేదా మస్లిన్ బ్యాగ్ తో వేయండి. దీన్ని ఫ్రిజ్ లో ఏదో ఒక మూలన పెట్టండి.
ఈ టీ ఆకులు వాటి సహజ లక్షణాల వల్ల ఫ్రిజ్ వాసనలను గ్రహిస్తాయి. దీనివల్ల ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడం తగ్గడమే కాదు ఫ్రిజ్ లో నుంచి రీఫ్రెష్ స్మెల్ వస్తుంది. మీ ఫ్రిజ్ లో ఫ్రెష్ నెస్ ఉండటానికి ఈ టీ ఆకులను ఏ రోజుకారోజు మార్చుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా చేసే సులువైన చిట్కా ఇది. ఎవ్వరైనా ఫాలో కావొచ్చు.
టీ ఆకులు, బేకింగ్ సోడా
టీ ఆకులు, బేకింగ్ సోడా మిశ్రమంతో కూడా ఫ్రిజ్ లో వాసన రాకుండా చేయొచ్చు. ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం టీ ఆకులను బేకింగ్ సోడాతో కలిపి ఒక చిన్న గిన్నెలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. బేకింగ్ సోడా ఫ్రిజ్ లోని వాసనలను తటస్తం చేస్తుంది. అలాగే టీ ఆకులు నానేలా చేస్తుంది. ఈ రెండూ ఫ్రిజ్ లోంచి దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉంచుతాయి. అయితే ఫ్రిజ్ లో ఉండే ఆహార పదార్థాల వల్ల ఫ్రిజ్ లో తేమ పేరుకుపోతుంది. దీన్ని గ్రహించడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని ప్రతి 7-10 రోజులకు ఖచ్చితంగా మార్చాలి.
ఉపయోగించిన టీ బ్యాగులు
ఉపయోగించిన టీ బ్యాగులతో కూడా ఫ్రిజ్ లోంచి వాసన రాకుండా చేయొచ్చు. టీ తయారు చేసిన తర్వాత టీ బ్యాగులను ఫ్రిజ్ లో పెడితే దుర్వాసన రాదు. ఇందుకోసం వాడేసిన టీ బ్యాగులు చల్లగా ఉండాలి. అలాగే వాటిని శీతలీకరించాలి. వీటిని ఫ్రిజ్ లో పెడితే ఫ్రిజ్ నుంచి ఎలాంటి వాసనా రాదు.
టీ ఆకులు, బొగ్గు
టీ ఆకులు, బొగ్గు కూడా ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొగ్గు బొగ్గు ఫ్రిజ్ లో ఉన్న అదనపు తేమను గ్రహిస్తుంది. చెడు వాసనలను కూడా గ్రహిస్తుంది. ఇందుకోసం టీ ఆకులతో కలిపిన బొగ్గుల మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టండి. బొగ్గును గనుక వాడితే ఫ్రిజ్ నుంచి వాసన అసలే రాదు. అలాగే టీ ఆకులు చెడు వాసన రాకుండా చేస్తాయి. అయితే ఈ మిశ్రమాన్ని నెలనెలా మారుస్తూ ఉండాలి.
తాజా టీ ఆకులను ఫ్రీజర్ లో ఉంచాలి
ఫ్రీజర్ లో దుర్వాసన రాకుండా ఉండటానికి తాజా లేదా పొడి టీ ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం టీ ఆకులను ఒక చిన్న సంచిలో వేసి ఫ్రీజర్ లో వేలాడదీయండి. ఈ టీ ఆకులు ఫ్రీజర్ చెడు వాసనను గ్రహించి తాజాదనాన్ని నింపుతాయి. టీ ఆకుల్లో ఉండే సహజ గుణాలు చెడు వాసనను తొలగించడమే కాకుండా ఫ్రీజర్ లో ఉండే తేమను కూడా నియంత్రించడానికి సహాయపడతాయి.
టీ ఆకులు, నిమ్మరసం
ఫ్రిజ్ నుంచి దుర్వాసనను పోగొట్టడానికి మరొక సింపుల్ మార్గం.. టీ ఆకులకు నిమ్మరసంలో కలిపి ఫ్రిజ్ ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఉంచి ఫ్రిజ్ లో ఒక మూలన పెట్టాలి. నిమ్మకాయ వాసన ఫ్రిజ్ నుంచి వచ్చే చెడు వాసనను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
టీ ఆకులు, నారింజ తొక్క
టీ ఆకులు, ఎండబెట్టిన నారింజ తొక్కలతో కూడా ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకుండా చేయొచ్చు. అచ్చం ఇది నిమ్మకాయలాగే పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా టీ ఆకులు, ఎండిన నారింజ తొక్కలను మెష్ బ్యాగ్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టడమే. ఆరెంజ్ తొక్కలు చెడు వాసనను తటస్తం చేస్తాయి. అలాగే సిట్రస్ వాసనను ఫ్రిజ్ లో మొత్తం వ్యాపింపజేస్తాయి.