మిగిలిపోయిన అన్నాన్ని ఇలా పెడితే.. మీరు రోజూ అందంగా కనిపిస్తారు
అన్నాన్ని తినడమే కాదు.. దీనితో మీరు అందంగా కనిపించేలా కూడా చేయొచ్చు. అవును మిగిలిపోయిన అన్నాన్ని ఒక పద్దతిలో ఉపయోగిస్తే మీ ముఖ చర్మం కాంతివంతంగా అవుతుంది.

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత అన్నం మిగిలిపోతుంది. ఇది కామన్. అయితే కొంతమంది మిగిలిపోయిన అన్నాన్ని ఏదో ఒక విధంగా తింటే.. మరికొంతమంది మాత్రం డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ దీన్ని మనం ముఖానికి కూడా ఉపయోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును మిగిలిపోయిన అన్నం మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అన్నం ముఖాన్ని మరింత అందంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే మిగిలిపోయిన అన్నాన్ని ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రైస్ ఫేస్ ప్యాక్
ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని డస్ట్ బిన్ లో వేయకుండా మీరు ముఖానికి కూడా ఉపయోగించొచ్చు. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ముఖాన్ని మరింత కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. అన్నం డల్, డార్క్ స్కిన్ సమస్యను తగ్గిస్తుంది. అందుకే ఈ రైస్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రైస్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలి?
ఇందుకోసం మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. దీనిలో పాలు, తేనె వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మంలోని మురికిని తొలగించి ఫేస్ గ్లో ని పెంచుతుంది.
రైస్ స్క్రబ్
మిగిలిపోయిన అన్నం మంచి స్క్రబ్బర్ గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సులువుగా తొలగిపోతుంది. అలాగే మీ చర్మం ఫ్రెష్ గా, కాంతివంతంగా మారుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా దీన్ని చేతులతో నెమ్మదిగా స్క్రబ్ చేయడమే.
రైస్ స్క్రబ్ ఎలా చేయాలి?
ఒక గిన్నెలో మిగిలిన అన్నం తీసుకుని మెత్తగా రుబ్బుకోండి. దీనిలో కొంచెం తేనె, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని చేతులతో ముఖమంతటా అప్లై చేసి స్క్రబ్ చేయండి. ఈ స్క్రబ్ మీ చర్మాన్ని హెల్తీగా, క్లియర్ గా చేస్తుంది.
అన్నాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ ఫేస్ స్క్రబ్ చర్మంలోని డెడ్ స్కిన్ ను లేకుండా చేస్తుంది. ఇకపోతే దీనిలో వాడే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రైస్ వాటర్ చర్మ రంధ్రాలను టైట్ చేయడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని రీఫ్రెష్ గా ఉంచుతాయి. అలాగే ఈ స్క్రబ్ చర్మం తేమను నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది.దీంతో మీ చర్మం డల్ గాఅస్సలు కనిపించదు. హైడ్రేట్ గా ఉంటుంది. అయితే ముఖానికి రైస్ ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవాలి.