కలర్ అవసరమే లేదు.. మందార పువ్వులను ఇలా వాడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది
ఈ రోజుల్లో ఒక్క పెద్దవారికే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోంది. ఈ తెల్ల జుట్టు అందాన్ని పాడు చేయడమే కాకుండా.. జుట్టుకు ఎప్పుడూ కలర్ వాడేలా చేస్తుంది. కానీ మీరు మందార పువ్వులను ఒక విధంగా వాడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అలాగే తెల్ల వెంట్రుకలు రానేరావు.
పొడుగు జుట్టైనా, పొట్టి జుట్టైనా సంరక్షణ లేకుండా ఎంతటి జుట్టైనా ఊడిపోతుంది. తెల్ల జుట్టు కూడా వస్తుంది. దీనికి తోడు నెత్తిమీద చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఆడవాళ్లకు జుట్టే అందం. కానీ ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల హెయిర్ ఫాల్, చిన్న వయసులో జుట్టు తెల్లబడటం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా తెల్ల జుట్టు చిన్న వయసులో రావడానికి ఒత్తిడి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ జుట్టు తెల్లబడటం మొదలైతే.. అన్ని వెంట్రుకలు మెల్లిమెల్లిగా తెల్లగా అవుతూనే ఉంటాయి. అందుకే ఇలాంటప్పుడు సరైన జుట్టు సంరక్షణ చాలా అవసరం. అలాగే మీరు తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
నిపుణుల ప్రకారం.. తెల్ల జుట్టుకు మందార పువ్వు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంట్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ ను తయారుచేసి పెట్టుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. అలాగే దీన్ని డైట్ లో చేర్చుకుంటే చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉండదు.
మందార పువ్వు తెల్ల జుట్టు రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అసలు మందార పువ్వు మన జుట్టుకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? దీన్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తెల్ల జుట్టుకు మందార పువ్వు
మందార పువ్వు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టును పొడుగ్గా పెంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది జుట్టు తెల్లబడటాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
మందార పువ్వుల్లో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు తెల్లబడటాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అంతేకాదు ఇది నెత్తిమీద రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టుకు లోపలి నుంచి మంచి పోషణను అందిస్తుంది.
మందార పువ్వును వాడటం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇది జుట్టు తెల్లబడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. మందార పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు మన చర్మానికి కూడా మేలు చేస్తాయి. మీరు గనుక ఈ మందార పువ్వులను మీ డైట్ లో చేర్చుకుంటే హై బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈజీగా బరువు కూడా తగ్గుతారు.
hibiscus
మందార పువ్వును ఆహారంలో ఎలా చేర్చాలి?
మందార పువ్వులను మనం డైట్ లో ఎన్నో విధాలుగా చేర్చొచ్చు. ఇందుకోసం మందార పువ్వులను మరిగించి టీ తయారుచేసి తాగొచ్చు. అలాగే పరిగడుపున ఈ మందార పువ్వులను తినొచ్చు. అలాగే మందార పువ్వుల సారం లేదా దాని పొడిని కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.