క్యారెట్ ను ఇలా పెడితే.. మీ ముఖం మెరిసిపోతుంది
క్యారెట్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఇది మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ముఖానికి ఫషేస్ ప్యాక్ లా వాడితే మీ ముఖం గ్లో పెరుగుతుంది. మీరు మరింత అందంగా కనిపిస్తారు.
క్యారెట్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిని చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెల్తీ క్యారెట్లతో టేస్టీ టేస్టీ స్వీట్ వంటకాలు, పరాఠాలు తయారుచేసుకుని తినొచ్చు. అంతేకాదు వీటిని చాలా మంది సలాడ్లలో కూడా తింటుంటారు.
carrot
ఈ క్యారెట్లు ఒక్క శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి తెలుసా? ముఖ్యంగా క్యారెట్ ను ముఖానికి దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే ముఖాన్ని అందంగా మెరిసేలా కూడా చేస్తుంది. అందుకే క్యారెట్లతో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫస్ట్ ఫేస్ ప్యాక్
క్యారెట్ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి క్యారెట్ జ్యూస్, గుడ్డుతెల్లసొన, పెరుగు అవసరపడతాయి. ఈ ప్యాక్ ను తయారుచేయడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇందుకోసం క్యారెట్ ను సన్నగా తురిమి కాటన్ క్లాత్ తో పిండండి. దీంట్లో గుడ్డు తెల్లసొన, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్ట్ ను పెట్టండి. దీన్ని మీరు మెడకు కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.
సెకండ్ ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి క్యారెట్లు, తేనె, నిమ్మరసం అవసరమవుతాయి. ఈ ప్యాక్ తయారు చేయడానికి రెండు క్యారెట్లను తీసుకుని ప్రెజర్ కుక్కర్ ఉడికించండి. ఇవి మెత్తగా ఉడికిన తర్వాత దింపండి. వీటిని మెత్తగా రుబ్బి చెంచా తేనె, సగం నిమ్మరసం వేసి కలపండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను శుభ్రంగా కడిగిన ముఖానికి అప్లై చేయండి. ఇది కొంచెం ఆరిన తర్వాత మీ ముఖాన్ని తడిపి, వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. తర్వాత మాస్క్ ను తీసేయండి. ఆ తర్వాత ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.