MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • బేబీ లోషన్ ను పెద్దవాళ్లు వాడితే ఏమౌతుందో తెలుసా?

బేబీ లోషన్ ను పెద్దవాళ్లు వాడితే ఏమౌతుందో తెలుసా?

బేబీ లోషన్ ను ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే వాడాలి. పెద్దవారు అస్సలు వాడకూడదని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే.. చిన్న పిల్లల బేబీ లోషన్ ను పెద్దవారు కూడా ఉపయోగించొచ్చు. దేనిదేనికంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 28 2024, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
skin care

skin care

చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త పడతారు. వారికి సంబంధించి  ప్రతిదాన్ని బెస్ట్ గా ఉండేట్టు చూసుకుంటారు. వారి ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయరు. సాధారణంగా చిన్న పిల్లలకు సంబంధించి అన్నీ సపరేట్ గా ఉంటాయి. ఈ బేబీ ప్రొడక్ట్స్ ను చిన్న పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారు. వేరే వారిని అస్సలు ఉపయోగించనివ్వరు. అయితే చాలా మంది బేబీ ప్రొడక్ట్స్ చిన్న పిల్లల కోసమే ప్రత్యేకించి తయారుచేయబడ్డాయి. ఇవి పెద్దవారికి పనికిరావని అనుకుంటారు. కానీ వీటిని పెద్దవారు కూడా ఉపయోగించొచ్చు. బేబీ ప్రొడక్ట్స్ లో మీరు బేబీ లోషన్ ను ఎంచక్కా ఉపయోగించొచ్చు. అదికూడా ఎన్నో విధాలుగా. అసలు బేబీ లోషన్ ను పెద్దవారు దేనిదేనికి ఉపయోగించొచ్చో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
skin care tips

skin care tips

మాయిశ్చరైజర్ గా..

బేబీ లోషన్  ను మీరు మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించొచ్చు. అవును సాధారణంగా బేబీ లోషన్లు హైడ్రేటింగ్ గా ఉంటాయి. అలాగే ఇది చర్మాన్ని చికాకు నుంచి కాపాడుతుంది. సున్నితమైన చర్మానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి ముందుగా  మీ ముఖాన్ని క్లీన్ చేయండి. ఆ తర్వాత అవసరమైన మొత్తాన్ని పెట్టండి. ఆ తర్వాత చర్మాన్ని వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. దీంతో దీన్ని మీ చర్మం బాగా గ్రహిస్తుంది. 

36

మేకప్ రిమూవర్ గా..

మీరు బేబీ లోషన్ ను మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించొచ్చు. బేబీ లోషన్లు చర్మంపై సున్నితంగా ఉంటాయి. అయితే ఇది మేకప్, వాటర్ ప్రూఫ్ మస్కారాను క్లీన్ చేయడంలో బాగా సహాయపడుతుంది. మేకప్ రిమూవ్ చేయడానికి బేబీ లోషన్ ను కాటన్ ప్యాడ్ పై లేదా నేరుగా మీ ముఖానికి పెట్టండి. అలాగే మేకప్ ను క్లీన్ చేయడానికి మీ చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన కాటన్ ప్యాడ్ తో తుడవండి. లేదా గోరువెచ్చని నీటితో కడగండి.

46
skin care

skin care

క్యూటికల్ క్రీమ్ లాగ.. 

బేబీ లోషన్ కూడా ఒక గొప్ప క్యూటికల్ క్రీమ్. అలాగే హ్యాండ్ మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇది మీ చేతులను మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. చేతుల డ్రై నెస్ ను తొలగిస్తుంది. అలాగే  ఇది క్యూటికల్ ను మృదువుగా చేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి మీ చేతులకు బేబీ లోషన్ ను పెట్టండి. బేబీ లోషన్ పూర్తిగా శోషించుకునే వరకు మీరు తేలికగా మసాజ్ చేయాలి.
 

56

ఫుట్ క్రీమ్ లాగ.. 

బేబీ లోషన్ కూడా గొప్ప ఫుట్ క్రీమ్ గా ఉపయోగపడుతుంది. ఇది మీ పొడి పాదాలను మృదువుగా చేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు తగినంత బేబీ లోషన్ తో మసాజ్ చేయండి. పాదాలు తేమగా ఉండేందుకు సాక్స్ లను తప్పకుండా వేసుకోండి. 
 

66

వడదెబ్బ నయం..

మీరు వడదెబ్బతో ఇబ్బంది పడుతుంటే మీ చర్మానికి బేబీ లోషన్ ను రాసుకోవచ్చు. బేబీ లోషన్ చర్మంపై సున్నితంగా ఉండటమే కాకుండా దాని హైడ్రేటింగ్ లక్షణాలు వడదెబ్బ అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. దీనిని ఉపయోగించడానికి మీరు బేబీ లోషన్ను వడదెబ్బ తగిలిన ప్రదేశంలో చాలా సున్నితంగా పెట్టండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved