MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • ఇవి తింటే.. మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

ఇవి తింటే.. మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయికీ ఉంటుంది. కానీ చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. అయితే ఇలాంటి వారు కొన్నిరకాల ఆహారాలను తింటే మాత్రం మీ జుట్టు ఆగమన్నా ఆగకుండా పొడుగ్గా పెరుగుతుంది తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 06 2024, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Hair growth

Hair growth

జుట్టు ఊడిపోకుండా ఉండాలని, పొడుగ్గా పెరగాలని చాలా మంది మార్కెట్ లోకి వచ్చిన ప్రతి నూనెను, షాంపూలను ట్రై చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. నిజానికి జుట్టు ఊడిపోవదన్నా.. పొడుగ్గా పెరగాలన్నా మీరు మంచి ఫుడ్ ను తీసుకోవాలి. అవును ఫుడ్ ద్వారానే మన వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. విటమిన్ బి 7 అని కూడా పిలువబడే బయోటిన్ అనేది నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది మన జుట్టును , చర్మాన్ని, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ రోజువారి ఆహారంలో బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చితే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Biotin Rich Foods

Biotin Rich Foods

బయోటిన్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. ఇది మన జుట్టు నిర్మాణాన్ని రూపొందించే కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో తగినంత మొత్తంలో బయోటిన్ ఉంటే మీ జుట్టు ఊడిపోదు. అలాగే పొడుగ్గా పెరుగుతుంది. అందుకే బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఓ లేక్కేద్దాం పదండి. 

37

గుడ్డు

గుడ్డు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే బయోటిన్ పుష్కలంగా ఉండే వనరుల్లో గుడ్లు ఒకటి. ఒక పెద్ద సైజు గుడ్డులో 10 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది. మీరు గనుక రోజూ ఒక గుడ్డును తిన్నట్టైతే మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అంతేకాదు గుడ్డు మిమ్మల్ని ఎన్నో రోగాలకు కూడా దూరంగా ఉంచుతుంది. 
 

47

గింజలు, విత్తనాలు

బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలలో కూడా బయోటిన్ తో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు బాగా పెరగానికి, జుట్టును బలంగా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. గింజలు, విత్తనాల్లో ఉండే పోషకాలు మన శరీరానికి కూడా మంచి మేలు చేస్తాయి.

57
salmon

salmon

సాల్మన్

సాల్మన్ చేపలు ఒక కొవ్వు చేపలు.  ఈ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మాత్రమే కాకుండా బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి  బాగా సహాయపడుతుంది. ఈ చేపలను తింటే మీ జుట్టు  ఆరోగ్యంగా పెరుగుతుంది. 

67

అవొకాడో

అవొకాడో మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మన జుట్టు ఊడిపోకుండా కూడా కాపాడుతుంది. అవొకాడోలో బయోటిన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇవి జుట్టుకు మంచి రంగును అందిస్తాయి? 
 

77
Sweet Potato

Sweet Potato

చిలగడ దుంప

తీయగా ఉండే చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని తింటే మన జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది తెలుసా? అవును బీటా కెరోటిన్ మెండుగా ఉండే చిలగడదుంపలను తింటే మీ మొత్తం ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved