MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • దుస్తులపై పీరియడ్స్ మరకలను పోగొట్టే ఎఫెక్టీవ్ చిట్కాలు

దుస్తులపై పీరియడ్స్ మరకలను పోగొట్టే ఎఫెక్టీవ్ చిట్కాలు

పీరియడ్స్ నొప్పి వల్ల వేరే ఏ విషయాలను పట్టించుకోరు. అయితే ఇలాంటి సమయంలో దుస్తులకు పీరియడ్స్ మరకలు అంటుకుంటుంటాయి. కానీ ఈ మరకలు అంత సులువుగా పోవు. కానీ కొన్ని చిట్కాలతో పీరియడ్స్ మరకలను ఇట్టే పోగొట్టొచ్చు. అదెలాగంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 21 2024, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కొంతమందికి పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పి, వికారం, నడుము, కాళ్లు లాగడంతో పాటుగా తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వీటివల్లే ఆడవారికి ఆ నాలుగైదు రోజులు వేరే ఏ విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే పీరియడ్స్ సమయంలో రక్తపు మరకలు అంటకూడదని చాలా మంది ఆడవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఎప్పుడో ఒకసారి మరకలు అంటుకుంటూనే ఉంటాయి. ఇది చాలా కామన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కానీ పీరియడ్స్ లో రక్తపు మరకలు అంటితే అవి అంత సులువుగా పోవు. అలాగే వాటి నుంచి వింతైన చెడు వాసన కూడా వస్తుంది. బట్టలపై ఉన్న పీరియడ్స్ రక్తపు మరకలను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే తడి రక్తపు మరకలను నీటిలో నానబెడితే సులువుగా పోతాయి. కానీ ఆరిన రక్తపు మరకలు మాత్రం పోవు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఆరిన రక్తపు మరకలను ఈజీగా పోగొట్టొచ్చు. 

34

నెలలో 4 నుంచి 5 రోజులు ప్రతి మహిళకు బాధాకరంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో బట్టల మీద రక్తం రావడం సర్వసాధారణం. కానీ వీటిని వాష్ చేసినా మరకలు మాత్రం అలాగే కనిపిస్తాయి. బెడ్ షీట్ లేదా కొన్నిసార్లు ప్యాంట్ అడుగు భాగంలో ఉండే రక్తపు మరకలు చూడలేకపోవడం వల్ల ఎండిపోతాయి. ఇలాంటి మరకలను ఎలా పోగొట్టాలంటే? 

44


కావాల్సిన పదార్థాలు

ఉప్పు
కూల్ వాటర్ 
గుడ్డ 
డిటర్జెంట్ 
గోరువెచ్చని నీరు
 

మరకను ఎలా శుభ్రం చేయాలి?

బట్టలపై డ్రై పీరియడ్ మరకలను శుభ్రం చేయడానికి వంటగదిలో ఉంచిన ఉప్పును ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా.. రక్తపటు మరక 1 నుంచి 2 వారాల వారకు అలాగే ఉంటే ఆ మరకను పోగొట్టడానికి మీరు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. పీరియడ్స్ రక్తపు మరకను శుభ్రం చేయడానికి మొదటగా ఆ డ్రెస్ ను నీటితో తడపండి. తడిపిన తర్వాత మరకపై ఉప్పును వేయండి. ఇప్పుడు ఆ డ్రెస్ ను 05 నుంచి 07 నిమిషాలు అలాగే ఉంచండి.  ఆ తర్వాత చేతులతో లేదా బ్రష్ తో రుద్ది శుభ్రం చేయండి. అయితే నైలాన్ వంటి వస్త్రాలపై ఉప్పును వాడకూడదు. ఈ దుస్తులకు ఉప్పును నీటిలో కలిపి వాడాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image2
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Recommended image3
Red Bangles: శ్రావణమాస వేడుకలకు పర్ఫెక్ట్ గాజుల డిజైన్స్ ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved