ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
చాలా మంది ఫ్రిజ్ లో ఇంచు కూడా గ్యాప్ లేకుండా వస్తువులను నింపేస్తుంటారు. అందులోనూ చాలా మందికి ఫ్రిజ్ ను క్లీన్ చేసే అలవాటే ఉండదు. దీనివల్లే ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన వస్తుంది. అసలు ఫ్రిజ్ లో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పట్టణాలే కాదు పెళ్లెల్లో కూడా ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వాడుతున్నారు. ఫ్రిజ్ లో కూరగాయల నుంచి చేపలు, కూరల వరకు ప్రతి ఒక్కటీ పెడుతుంటారు. ఫ్రిజ్ లో పెట్టిన వస్తువులు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందుకే విగిలిపోయిన వంటలను కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ ను మాత్రం ఎప్పుడో ఒక్కసారి క్లీన్ చేస్తుంటారు. దీనివల్లే ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంది. అసలు ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దుర్వాసన
వంట సామగ్రి త్వరగా పాడవకుండా ఉండటానికి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయితే ఇలా రోజుల తరబడి వీటిని నిల్వ ఉంచినప్పుడు.. ఫ్రిజ్ ను తెరిచినప్పుడు దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Fridge Clean
దోశ పిండి సంరక్షణ
ప్రతిరోజూ దోశ, ఇడ్లీలను తినాలనుకునేవారు ఐదారు రోజులకు సరిపడా దోశపిండిని, ఇడ్లీ పిండిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయితే చాలా మంది ఈ పిండి గిన్నెను ఓపెన్ గా పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు పెట్టకూడదు. ఈ పిండిని మూసిన పాత్రలోనే నిల్వ చేయాలి. ఎందుకంటే పులియబెట్టడం వల్ల దుర్వాసన వస్తుంది.
కాయగూరలు
రిఫ్రిజిరేటర్ లో ఉంచిన కూరగాయల నుంచి దుర్వాసన రాకూడదంటే కూరగాయలను ఫ్రిజ్ లో అలాగే పెట్టకుండా వాటిని ఒక పాత్ర లేదా కవర్ లో చుట్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. వాసన కూడా రాదు.
Fridge Clean
ఫ్రిజ్ శుభ్రం
చాలా మంది సామాన్లను ఫ్రిజ్ లో పెట్టడమే కానీ.. వాటిని మాత్రం క్లీన్ చేయరు. కానీ వంట సామాగ్రిని నిల్వ ఉంచే రిఫ్రిజిరేటర్ ను కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిజ్ ను బాగా ఆరబెట్టాలి. అయితే ఫ్రిజ్ ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిజ్ ను స్విచ్ ఆఫ్ చేయాలి.