ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా..?
ఇప్పుడు దానిని పూర్తిగా ఎండిపోనివ్వాలి. ఆ తర్వాత చేతిని తడిగా చేసుకొని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తొలగిపోతాయి.
చాలా మంది అమ్మాయిలను అవాంఛిత రోమాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాని కోసం పార్లర్ కి వెళ్లి వాటిని తొలగిస్తూ ఉంటారు. అయితే, కేవలం ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో సలభంగా వాటిని తొలగించవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
1.పసుపు..
ముందుగా పసుపు తీసుకొని అందులో పాలు కానీ, నీరు కానీ పోసి మందపాటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ముఖంపై వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇప్పుడు దానిని పూర్తిగా ఎండిపోనివ్వాలి. ఆ తర్వాత చేతిని తడిగా చేసుకొని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు తొలగిపోతాయి.
papaya
2.బొప్పాయి, పసుపు..
ముందుగా బొప్పాయి గుజ్జు చేసుకోవాలి. దానిలో పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మెత్తని పేస్టులాగా చేసుకొని, ముఖంపై రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి.
3.పంచదార, నిమ్మరసం..
ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి స్టిక్కీ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీనిని డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు వెంట్రుకలకు వ్యతిరేక దిశలో రుద్దాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలను సులభంగా తొలగించవచ్చు.
4.కోడిగుడ్డు తెల్ల సొన..
ఒక కోడిగుడ్డు తెల్ల సొనలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలపాలి. దాంట్లో కొంచెం పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత దానిని పూర్తిగా ఎండనివ్వాలి. ఇప్పుడు మఖాన్ని పీల్ మాస్క్ లాగా తీయాలి. వెంట్రుకలు కూడా తొలగిపోతాయి.
besan
5.శెనగపిండి మాస్క్.
ప్రతి ఒక్కరి ఇంట్లో శెనగ పిండి ఉంటుంది. దానిని ఉపయోగించి కూడా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. శెనగపిండిలో కొంచెం పసుపు కలిపి, దాంట్లో నీరు వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. ఎండిపోయిన తర్వాత రుద్దుతూ ముఖాన్ని కడగాలి.తరచూ చేయడం వల్ల వెంట్రుకలు తగిపోతాయి.