MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • నుదుటిన వెంట్రుకలు బాగా ఊడిపోతున్నాయా? ఇలా చేశారంటే అస్సలు ఊడిపోవు..

నుదుటిన వెంట్రుకలు బాగా ఊడిపోతున్నాయా? ఇలా చేశారంటే అస్సలు ఊడిపోవు..

వయస్సు, జెనెటిక్స్, ఆండ్రోజెన్ హార్మోన్ మార్పుల వల్లే బట్టతల వస్తుంది. ఆడవారికి తల మధ్యభాగంలో వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తే.. చాలా మంది ఆడవారికి నుదిటి దగ్గర ఎంట్రుకలు బాగా ఊడిపోతుంటాయి. అయితే దీన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో తగ్గించుకోవచ్చు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Mar 17 2024, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జుట్టు రాలడం చాలా సహజం. మగవాళ్లు, ఆడవాళ్లంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జుట్టు ఊడిపోతుంటుంది. రోజూ 50 వెంట్రుకలు ఊడిపోవడం సహజమే. వీటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. అయితే ఇంతకు మించి జుట్టు ఊడిపోతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇది హెయిర్ ఫాల్ సమస్య కాబట్టి. జుట్టు ఒత్తుగా ఉండేనే ముఖం అందంగా కనిపిస్తుంది. ఆడవారికి పొడవాటి జుట్టు, మగవాళ్లకు ఒత్తైన జుట్టు ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. కానీ నేడు చాలా మంది చిన్న వయసులోనే బట్టతల సమస్య బారిన పడుతున్నారు. కేవలం మగవారే కాదు ఆడవారు కూడా నుదుటి బట్టతలతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆడవారు బయటకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
hair fall

hair fall

వయసు పెరగడం, వంశపారంపర్యం, ఆండ్రోజెన్ హార్మోన్ మార్పులే బట్టతలకి ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య బారిన పడకూడదంటే చిన్న వయసు నుంచే జుట్టును సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తినడం, వారానికి ఒకసారి  తలస్నానం చేయడం, నెత్తిని శుభ్రం చేయడం చేస్తే బట్టతల బారిన పడే ప్రమాదం ఉండదు. మరి బట్టతల రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

36
hair fall

hair fall

ఆడవారు నుదుటిపై బట్టతల సమస్య నుంచి బయటపడాలంటే వారానికి ఒక్కసారైనా కలబంద జెల్ ను నెత్తికి పెట్టి.. తలస్నానం చేయాలి. కలబందలో ఉండే పోషకాలు జుట్టు, నెత్తిమీద పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. 

46
<p>hair fall</p>

<p>hair fall</p>

జుట్టు సంరక్షణకు మెంతులు కూడా ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ. అవెును మీ జుట్టు పెరగడానికి లేదా జుట్టు రాలకుండా నియంత్రించడానికి కూడా మెంతులు సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను బాగా నానబెట్టాలి. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తలకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలను చల్లగా ఉంచుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి వడకట్టి నీటిని తాగడం వల్ల శరీరం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. 

56

మీ జుట్టు బాగా పెరగడానికి లేదా బట్టతలలో వెంట్రుకలు మొలవాలంటే మాత్రం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిని ఉపయోగించండి. ఉసిరికాయ. కొబ్బరి నూనె, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను ఆడవారు రోజూ ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

66

జుట్టు ఒత్తుగా పెరగడానికి గుడ్డులోని తెల్లసొన బాగా ఉపయోగపడుతుంది. ఈ తెల్లసొనను తీసుకుని దీన్ని జుట్టు మూలాలకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. దీనిలో ఉండే పోషకాలన్నీ జుట్టును నేచురల్ గా మెయింటైన్ చేయడానికి సహాయపడతాయి.

వీటితో పాటుగా ఎక్కువ కెమికల్స్ లేని షాంపూలను మాత్రమే వాడాలి. సాధ్యమైనంత వరకు షాంపూలకు బదులుగా మెంతులను ఉపయోగించండి. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved