MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మిరపకాయలు కోసిన తర్వాత చేతుల్లో మంట తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

మిరపకాయలు కోసిన తర్వాత చేతుల్లో మంట తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

పచ్చి మిరపకాయలు ఫుడ్ ను స్పైసీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి తో పాటుగా మన ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పచ్చి మిరపకాయలను కోసిన ప్రతిసారీ చేతుల్లో విపరీతంగా మంట కలుగుతుంది. ఈ మంట ఎంతకీ పోదు. కానీ మీరు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మాత్రం మంట కొద్దిసేపట్లోనే తగ్గిపోతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 28 2024, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మిరపకాయలు కోసిన తర్వాత చాలా సార్లు చేతుల్లో మంటగా అనిపిస్తుంటుంది. ఇది చాలా కామన్. ఇలా మంటగా అనిపించినప్పుడు చాలా మంది చేతులను నీళ్లతో కడగడమో లేదా నీళ్లలో పెట్టడమో చేస్తుంటారు. కానీ దీనివల్ల కూడా మంట తగ్గదు. అసలు మిరపకాయలను కోస్తే చేతుల్లో ఎందుకు మంట వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26

మిరపకాయలను కోసిన తర్వాత చేతుల్లో మంట ఎందుకొస్తుంది? 

మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని మిరపకాయల్లో ఎక్కువగా, కొన్ని దాంట్లో తక్కువగా ఉంటుంది. అయితే మీరు క్యాప్సైసిన్ ఎక్కువగా ఉండే మిరపకాయను కోసినప్పుడు మీ చేతుల్లో మంటగా అనిపించడం మొదలవుతుంది. ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. ఇది కొన్ని గంటల్లో దానంతట అదే తగ్గిపోతుంది. 

36

చేతుల మంట తగ్గాలంటే ఏం చేయాలి? 

పెరుగు, నెయ్యి లేదా పాలు వాడండి

మిరపకాయలు కోసిన తర్వాత చల్లటి పాలు, నెయ్యి, వెన్న లేదా పెరుగును చేతులకు రాసుకుంటే చేతుల మంట తగ్గుతుంది. అయితే మీరు వీటిలో దేన్ని చేతులకు రుద్దుకున్నా కనీసం రెండు నిమిషాలైనా ఉంచాలి. అప్పుడే మంట తగ్గుతుంది. 
 

46

కలబంద జెల్ 

కలబంద గుజ్జు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలొవేరా జెల్ మిరపకాయను కోసిన తర్వాత మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్ తీసుకొని మీ చేతులకు క్రీమ్ లాగా అప్లై చేయండి లేదా జెల్ తో చేతులను మసాజ్ చేయండి. ఇది మంటను వెంటనే తగ్గిస్తుంది. 
 

56
honey

honey


తేనె 

చిన్న చిన్న గాయాలను నయం చేయడానికి, మంటను, చికాకును తగ్గించడానికి తేనె కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  మిరపకాయలు కోసిన తర్వాత చేతులకు తేనెను రాసుకుంటే మంట వెంటనే తగ్గుతుంది. అయితే తేనెను చేతులకు అప్లై చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు దీన్ని కొద్దిగా నిమ్మరసంతో కలిపి పెట్టుకోవాలి. 

66

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్ కూడా చేతుల మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం మిరపకాయను కట్ చేసిన తర్వాత ముందుగా ఐస్ క్యూబ్ ను చేతుల్లో పెట్టుకోండి. ఐస్ తో చేతులకు మసాజ్ చేయొచ్చు. అలాగే చల్లని నీటిలో చేతులు ముంచడం వల్ల కూడా మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?
Recommended image2
Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..
Recommended image3
Banana Peel: అరటి తొక్కను ఇలా వాడితే మీ అందం పెరగడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved