MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • Monsoon: వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు ఏం చేయాలి..?

Monsoon: వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు ఏం చేయాలి..?

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలంలోనూ మన జట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఓసారి చూద్దాం.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2022, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఆ ఎండల తర్వాత వస్తున్న ఈ వర్షాలు కాస్త హాయిగానే అనిపిస్తాయి. మనకు కూడా హాయి ఫీలింగ్ కలుగుతుంది. దాదాపు వర్షం అంటే అందరికీ ఇష్టమే. అయితే... ఈ వర్షాకాలంలో మన అందాన్ని కాపాడుకోవడానికి మాత్రం చాలా తిప్పలే పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మీరు గమనించారో లేదో.. వర్షాకాలం రాగానే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. అధిక తేమ కారణంగా చాలా మందికి చుండ్రు సమస్య కూడా వస్తూ ఉంటుంది. అంతేకాదు.. జుట్టు నిర్జీవంగా...కళాకాంతి లేకుండా తయారౌతుంది. అందుకే.. వర్షాకాలంలో జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలంలోనూ మన జట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఓసారి చూద్దాం..

310

ఆరోగ్యకరమైన జుట్టు ఎప్పుడూ అందంగానే కనపడుతుంది. వాతావరణం కారణంగా జుట్టు పాడవ్వకుండా ఉండేందుకు తరచూ షాంపూ, కండిషనింగ్ చేయడం తప్పనిసరి. అయితే.. అక్కడితో ఆగకుండా.. జుట్టును సంరక్షించుకోవడానికి సీరమ్ లను కూడా ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. అయితే.. వేసవి కాలంలో ఉపయోగించే ఉత్పత్తులు.. వర్షాకాలంలోనూ సెట్ అవుతాయి అనుకోవడం మాత్రం పొరపాటు. సీజన్ కి తగినవి ఉపయోగించాలి.

410

చాలా మంది వర్షాకాలంలో ఎక్కువగా వర్షంలో తడవడానికి ఇష్టపడతారు. అయితే... ఎక్కువగా వర్షంలో తడవడం వల్ల జుట్టు త్వరగా పాడౌతుందట. వర్షంలో తడిచినప్పుడు కాలుష్యం, ట్యాక్సిన్స్ జుట్టును త్వరగా పాడవ్వడానికి కారణమౌతాయి. కాబట్టి.. వర్షంలో తడవకుండేలా జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున తడిస్తే.. వెంటనే తలస్నానం చేయాలి. ప్రోటీన్, కెరాటిన్ పుష్కలంగా ఉండే షాంపూను ఎంచుకోవడం ఉత్తమం.

510

జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి పోషకాలు చాలా అవసరం. మరి జట్టుకు పోషకాలు అందాలి అంటే.. మనం క్రమం తప్పకుండా నూనె రాయాల్సి ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు నూనె రాసి తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆకృతి అంంగా ఉండటంతోపాటు.. పోషకాలు కూడా అంతుాయి. 

610

ఆర్గానిక్ ఆయిల్, ఆమ్లా షీకాకై ఆయిల్ , బ్రింగ్ రాజ్ , ఆనియన్ హెయిర్ ఆయిల్ లాంటివి ఎంచుుకోవడం మంచిది. సరైన నూనెను ఎంచుకుంటూ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రాత్రిపూట ఆయిల్ రాసి ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. లేదంటే.. తలస్నానానికి రెండు గంటల ముందు నూనె రాసుకోవడం లాంటివి కూడా చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది.

710

ఇక జుట్టు ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.  దాని కోసం కండిషనర్ వాడటం తప్పనిసరి. ముందు హెయిర్ ని శుభ్రంగా వాష్ చేసి.. తర్వాత కండిషనర్ ఉపయోగించండి. కండిషనర్ జుట్టును సహజ తేమను చెక్కుచెదరనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

810

రెగ్యులర్ కండిషనింగ్‌తో పాటు, ఎప్పటికప్పుడు డీప్ కండిషనింగ్‌ను కూడా పాటించాలి. హెయిర్ మాస్క్ లేదా క్రీమ్ జుట్టుకు అదనపు మోతాదులో హైడ్రేషన్ ఇస్తుంది, అది మెరుస్తూ, మృదువుగా ఉండటానికి సహాయం చేస్తుంది.
 

910

మీ జుట్టును మరింత డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి, మంచి హెయిర్ సీరమ్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. హెయిర్ సీరమ్ వాడటం వల్ల జుట్టు మీద ఓ రక్షణ కవచంలా ఓ పొరను ఏర్పాటు చేస్తుంది.

1010

అయితే.. అది జిడ్డుగా మాత్రం ఉండదు. కానీ.. జుట్టును రక్షిస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే.. వర్షాకాలంలో జుట్టును ఎలాంటి టెన్షన్ లేకుండా రక్షించుకోవచ్చు.
 


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved