ఇంట్లోనే అలొవేరా జెల్ ను ఎలా తయారుచేయాలి?
మన చర్మానికి కలబంద జెల్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన స్కిన్ ను ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తుంది. అందుకే చాలా మంది అలొవేరా జెల్ ను వాడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో దీన్ని మనం ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన చర్మాన్ని ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తాయి. సాధారణంగా కాలిన గాయాలు, కోతలు, చర్మపు చికాకులను తగ్గించుకోవడానికి కలబంద జెల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ జెల్ లో పాలిసాకరైడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మ మరమ్మత్తు, కొత్త కణాల పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే ఇది తేమను నిలుపుకోవటానికి సహాయపడే రక్షిత పొరను కూడా అందిస్తుంది. మీకు తెలుసా? కలబంద జెల్ ఒక గొప్ప మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.
ఆర్ద్రీకరణ, పోషణ
కలబంద జెల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి 12, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కలబంద జెల్ మన చర్మం, జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. ఈ పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తాయి. అలాగే చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. కలబంద జెల్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఇది చుండ్రును తగ్గిస్తుంది. దెబ్బతిన్న వెంట్రుకలను మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.
సహజ, రసాయన రహిత కలబంద జెల్
మీరు ఇంట్లోనే అలొవేరా జెల్ ను తయారుచేసినప్పుడు మార్కెట్ లో దొరికే వాటిలాగ వాటిలో రసాయనాలను కలపాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి కలబంద జెల్ మీ చర్మం, జుట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సింథటిక్ పదార్థాలకు ప్రతిస్పందించగల సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మంచి మేలు చేస్తుంది.
aloe vera gel
అలోవెరా జెల్ ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
అలోవెరా మొక్క: ఇంట్లో కలబంద జెల్ ను తయారుచేయడానికి అలొవేరా మొక్క అవసరం. అయితే చాలా రోజులుగా ఉన్న కలబంద ఆకులో ఎక్కువ జెల్, పోషకాలు ఉంటాయి. అందుకే కలబంద జెల్ ను తయారుచేయడానికి కనీసం కొన్ని సంవత్సరాల వయస్సు ఉన్న పరిపక్వ మొక్కను ఉపయోగించండి. ఈ జెల్ ను తీయడానికి పదునైన కత్తి, చెంచా అవసరపడతాయి. కత్తితో ఆకలను కట్ చేస్తే.. స్పూన్ తో జెల్ ను తీయాలి. జెల్ ను మార్కెట్ లో మాదిరిగా చేయడానికి బ్లెండర్ అవసరపడుతుంది. అలాగే మీరు తయారుచేసిన కలబంద జెల్ ను నిల్వ చేయడానికా గాలి వెల్లని కంటైనర్ అవసరం. గ్లాస్ జార్లైతే జెల్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది.
అలొవేరా జెల్ న ఎలా తయారుచేయాలి?
ముందుగా కలబంద బయటి భాగాల నుంచి మందపాటి, సున్నితమైన ఆకును కట్ చేయండి. ఈ బయటి ఆకులు పరిపక్వంగా ఉంటాయి. అలాగే ఎక్కువ జెల్ ను కలిగి ఉంటాయి. అందుకే మొక్క అడుగు భాగంలో ఉన్న ఆకును కట్ చేయండి. అయితే అడుగుభాగంలో ఉన్న కలబంద ఆకుకు ధూళి, దుమ్ము లేదా పురుగుమందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే కట్ చేసిన తర్వాత ఈ ఆకును నీళ్లతో శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత ఆకు రెండు వైపులా మురికి అంచులను జాగ్రత్తగా కత్తిరించండి. ఇది ఆకు మానిప్యులేషన్ ను ఈజీ చేస్తుంది. ఆ తర్వాత కలబంద ఆకును చదునుగా పెట్టి ఆకు చర్మం చదునైన పై పొరను కట్ చేయండి. దీనివల్ల లోపలి జెల్ మీకు కనిపిస్తుంది. ఈ జెల్ ను స్పూన్ తో తీసి ఒక బౌల్ లో వేయండి.
Image: Getty Images
జెల్ ను మొత్తం బ్లెండర్ లో వేయండి. మంచి మృదువైన, స్థిరమైన ఆకృతి వచ్చిన తర్వాత బయటకు తీసి దానిలో కొన్ని చుక్కల విటమిన్ ఇ నూనె లేదా టీ ట్రీ లేదా లావెండర్ వంటి ముఖ్యమైన నూనెలను కలపండి. ఇది జెల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఈ సహజ సంరక్షణకారులు జెల్ తాజాదనాన్ని పొడిగించడమే కాకుండా, అదనపు ఆర్ద్రీకరణ, మంచి వాసనను ఇస్తాయి.
aloe vera gel
జెల్ ను ఎలా నిల్వ చేయాలి?
జెల్ ను శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్ లోకి పెట్టండి. ఇది ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిజ్ లో నిల్వ చేయండి. సరిగ్గా నిల్వ చేసినప్పుడు మీ ఇంట్లో తయారుచేసిన కలబంద జెల్ రెండు వారాల వరకు ఉంటుంది.