బెనారస్ చీరలో అందంగా మెరవాలంటే... ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..!
చిన్న చిన్న కుచ్చిళ్లు వేసుకుంటే.. పొట్ట దగ్గరగా ఎత్తుగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కుచ్చిళ్లు.. కొంచెం పెద్దవిగా వేసుకోవాలి. అప్పుడు అందంగా కనపడే అవకాశం ఉంటుంది.
చీర కట్టుకోవడం అంత సులభమేమీ కాదు. అయితే.. మామూలు చీరలు అయితే.. ఎవరైనా సింపుల్ గా కట్టేసుకుంటారేమో... కానీ.. బెనారస్ లాంటి చీరలు కట్టుకోవాలంటే.. ఫర్ఫెక్షనిస్టులు అయ్యి ఉండాలి. ఈ బెనారస్ చీరను ఎలాంటి ఫంక్షన్ లో అయినా కట్టుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్.. దేనికి కట్టుకున్నా.. ఈ చీరలో మెరిసిపోవచ్చు. మరి ఈ చీరలో ట్రెండీ గా కనిపించాలి అంటే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
ఈ బెనారస్ చీర కట్టుకున్నప్పుడు అందంగా కనిపించాలి అంటే.. చీర కుచ్చిళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చీరకు కుచ్చిళ్లను కొంచెం పెద్దవిగా వేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చిళ్లు వేసుకుంటే.. పొట్ట దగ్గరగా ఎత్తుగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కుచ్చిళ్లు.. కొంచెం పెద్దవిగా వేసుకోవాలి. అప్పుడు అందంగా కనపడే అవకాశం ఉంటుంది.
ఈ బెనారస్ చీరలో పల్లు వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బ్లౌజ్ డిజైన్డ్ గా, గ్రాండ్ గా డిజైన్ చేయించుకుంటే.. బెనారస్ చీరను సింపుల్ గా ఎంచుకోవాలి. అలా కాదు అంటే.. గ్రాండ్ గా ఉన్న చీరను ఎంచుకోవచ్చు. ఇక.. సింగిల్ స్టెప్ పల్లు వేసుకున్నా కూడా అందంగా కనపడతారు.
ఇక ఈ బెనారస్ చీర ధరించినప్పుడు.. హెవీ జ్యువెలరీ ధరించకూడదు. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, హెవీ నక్లెస్ లు ధరించడం వల్ల.. చీర అందాన్ని పోగడతారు. కాబట్టి.. సింపుల్ జ్యువెలరీ ధరించాల్సి ఉంటుంది. సింపుల్ గా ఒక చోకర్ ధరిస్తే సరిపోతుంది.
బనార్సీ చీరతో ఫిష్ కట్ పెట్టీకోట్ ధరించడం ఎవరైనా చేసే అతి పెద్ద తప్పు. చీరలలోనే బల్క్ ఉంటాయి .పెట్టీకోట్‌లో ఎక్కువ బల్క్‌లు ఉండటం కొన్నిసార్లు పొట్ట ఎక్కువగా ఉన్నవారి విషయంలో అన్‌డూడింగ్‌గా ఉంటుంది. కాబట్టి.. పలచగా ఉండే పెట్టికోట్ ని ఎంచుకోవాలి.
ఓపెన్ పల్లు బెరారస్ చీరకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. చీరలు భుజం దగ్గర నుంచి ఫ్రీగా వదిలేయాలి. అప్పుడు.. చీరకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. ఇక .. ఈ చీరకు బ్లౌజ్ మృదువుగా ఉండేలా చూసుకోవాలి.