Hair Colour:హెయిర్ కలర్ తో పనిలేదు...టీ, కాఫీ పొడి ఉంటే వైట్ హెయిర్ సమస్యే ఉండదు..!
Hair Colour: తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటారు. అవి.. జుట్టును చాలా ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. జుట్టు తొందరగా ఊడిపోతుంది కూడా.

grey hair
తెల్ల వెంట్రుకలు వృద్ధాప్యానికి సంకేతం. తెల్ల వెంట్రుకలు కనపడగానే చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే వాటిని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ కలర్స్ వాడేస్తూ ఉంటారు. కానీ.. అవి ఫ్యూచర్ లో జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. జుట్టు పొడిబారడం, ఎక్కువగా ఊడిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే.. అవి వాడకుండా.. ఇంట్లో దొరికే టీ పొడి, కాఫీ పొడితో మీ తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
కాఫీ డికాషన్..
ముందుగా ఒక ఒకప్పు బ్లాక్ టీ లేదా కాఫీ తో డికాషన్ తయారు చేసుకోవాలి. దీని కోసం.. నీటిలో టీ పొడి లేదా కాఫీ పొడి వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి. ఎంత ఎక్కువగా మరిగిస్తే... జుట్టుకు అంత మంచి డార్క్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న డికాషన్ చల్లారే వరకు ఆగాలి. వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా జుట్టుకు రాయడం మంచిది కాదు.. దాని వల్ల తల కాలడంతో పాటు.. హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తలస్నానం చేసిన తర్వాత...
దీని కంటే ముందు.. రసాయనాలు, ఘాడత లేని షాంపూ తో తలస్నానం చేయాలి. ఆ తర్వాత.. ఈ డికాషిన్ ని జుట్టుకు పట్టిస్తే.. తెల్ల వెంట్రుకలు చాలా తొందరగా నల్లగా మారతాయి. చల్లారిన డికాషిన్ ని డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేయవచ్చు. లేదంటే.. బ్రష్ సహాయంతో కుదుళ్ల నుంచి చివర్లకు సమానంగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతి తెల్ల వెంట్రుక.. నల్లగా మారుతుంది. జుట్టుకు ఈ డికాషిన్ రాసిన తర్వాత.. తలకు మంచిగా మసాజ్ చేయాలి. బాగా మసాజ్ చేసిన తర్వాత తలకు షవర్ క్యాప్ తగిలించాలి. కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు.. అలానే వదిలేయాలి.
తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే రెమిడీ..
గంట తర్వాత... నీటితో తలను కడగాలి. ఒక్కసారి చేయగానే జుట్టంతా నల్లగా మారకపోవచ్చు. కానీ.. రెగ్యులర్ గా చేయడం వల్ల కచ్చితంగా జుట్టు నల్లగా మారుతుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు... దీనిని వాడటం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. టీ, కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి మెరుపు, మృదుత్వాన్ని అందిస్తాయి. కెమికల్స్ ఉండవు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. జుట్టు సురక్షితంగా ఉంటుంది. తరచూ వాడటం వల్ల జుట్టు మరింత బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.
ఫైనల్ గా....
కెమికల్ డైలకు బదులుగా సహజ మార్గాలను ఎంచుకోవడం ఆరోగ్యానికీ, జుట్టుకు రెండింటికీ చాలా మేలు చేస్తుంది. టీ, కాఫీ తో తయారు చేసే ఈ సహజ రంగు పద్దతి జుట్టును నల్లగా చేయడమే కాకుండా... సహజ మెరుపుతో అందంగా కనిపించేలా చేస్తుంది.