Grey Hair: ఈ ఒక్క నూనె రాసినా.... తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది..!
Grey Hair సహజంగా జుట్టును అందంగా మార్చుకోవడానికి మనం హెన్నా ఆకులను వాడొచ్చు. ఈ హెన్నా ఆకులతో నూనె తయారు చేసి.. జుట్టుకు వాడటం వల్ల... చాలా కొద్ది రోజుల్లోనే సహజంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Grey Hair
జుట్టు మన అందానికి ప్రతిబింబం. కానీ, ప్రస్తుతం వాతావరణం అంతా కాలుష్యంగా మారిపోయింది. దానికి తోడు.. పని ఒత్తిడి ఉండనే ఉంది. పైగా జుట్టు కోసం వాడేదంతా రసాయనాలతో నిండిన ఉత్పత్తులే. సరైన ఆహారం అయినా తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. వెరసి ఇవన్నీ కలిసి... చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా.. విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా ఉంటోంది. ఇక.. తెల్ల వెంట్రుకలు రావడం మొదలవ్వగానే... ఎక్కడ వయసు మళ్లిన వారిలా కనపడతామో అనే భయంతో... వాటికి రంగులు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక.. ఆ రంగులు జుట్టును మరింత డ్యామేజ్ చేసేస్తాయి. ఇవేమీ లేకుండా.... సహజంగా కూడా జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.
తెల్ల జుట్టును నల్లగా మార్చే నూనె ఎలా తయారు చేయాలి..?
మనకు గోరింటాకు చాలా సహజంగా లభిస్తుంది. ఈ గోరింటాకును డైరెక్ట్ గా తెల్ల జుట్టుకు అప్లై చేస్తే... అవి ఎర్రగా మారతాయి. కానీ, ఈ గోరింటాకు పొడితో నూనె తయారు చేసి అప్లై చేస్తే.... జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు... ఈ నూనె జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. తలలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వాడితే.. తెల్ల వెంట్రుకల సమస్య అనేదే ఉండదు. జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ హెన్నా నూనె తయారీ విధానం...
కావాల్సిన పదార్థాలు....
1.కొబ్బరి నూనె- 1కప్పు, హెన్నా పొడి-2 టీ స్పూన్లు, కరివేపాకు- 8 నుంచి 10 ఆకులు, మెంతులు-1 టీ స్పూన్
నూనె తయారు చేయడానికి... ఒక చిన్న గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె పోయాలి. దానిలో హెన్నా పొడి వేసి బాగా కలపాలి. త ర్వాత అందులో కరివేపాకు చూర్ణం, మెంతులు వేసి బాగా కలపాలి. ఈ నూనెను ఇప్పుడు మీడియం మంట మీద ఉంచి కనీసం 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. ఈ నూనెను వడగట్టి... గాజు సీసాలో స్టోర్ చేయాలి. ఎక్కువగా వేడి చేయకూడదు. తక్కువ మంట మీద మాత్రమే మరిగించాలి.
ఈ నూనె ఎలా వాడాలి...?
ఈ నూనెను వారానికి రెండు నుంచి మూడు సార్లు వాడండి. తలస్నానం చేయడానికి ముందురోజు రాత్రి లేదంటే.. కనీసం ఒక గంట ముందు.. ఈ నూనెను తలకు బాగా పట్టించాలి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది.
హెన్నా నూనె వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు....
హెన్నా నూనెను రెగ్యులర్ గా వాడటం వల్ల... జుట్టు కుదుళ్లు బలపడతాయి. కనీసం రెండు నెలలు వరసగా వాడితే.. మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారడం గమనిస్తారు. జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. రసాయన పదార్థాలతో నిండిన మార్కెట్ ఆయిల్స్ కంటే, మీరు ఇంట్లో తయారు చేసిన హెన్నా ఆయిల్ సహజం, సురక్షితం. ఇది మీ జుట్టుకు పోషణ, రంగు, బలం అన్నీ ఇస్తుంది.