MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తెల్ల జుట్టుకు ఈ నూనె పెడితే వెంట్రుకలు నల్లగా అవుతాయి

తెల్ల జుట్టుకు ఈ నూనె పెడితే వెంట్రుకలు నల్లగా అవుతాయి

ఈ  కాలంలో చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అసలు ఈ తెల్ల వెంట్రుకలు ఏం చేస్తే నల్లగా అవుతాయని నెట్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఒక నూనెతో తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుంది. జుట్టు నల్లగా అవుతుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 29 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడైతే తెల్ల వెంట్రుకలు 40, 50 ఏండ్లవారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కానీ ఈ తెల్ల వెంట్రుకలు జుట్టు అందాన్ని తగ్గించేస్తాయి. ముసలివాళ్లలా కనిపించేలా చేస్తాయి. అందుకే తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ నల్ల రంగును వేస్తుంటారు. కానీ ఈ రంగు కొన్ని రోజుల్లోనే పోతుంది. కానీ పదేపదే కెమికల్ కలర్స్ ను జుట్టుకు వేయడం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కలర్స్ వల్ల జుట్టు రాలడం, డ్రైగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇక నుంచి కెమికల్ కలర్స్ ను జుట్టుకు వాడటం మానేయండి. నిజానికి రంగు వేయకుండానే జుట్టును నల్లగా చేయొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.  ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే నల్లని, అందమైన జుట్టుకోసం హెయిర్ డై ని తయారుచేయొచ్చు. ఇందుకోసం కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. తెల్ల జుట్టును నల్లగా చేసే నూనెను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

36

జుట్టుకు కొబ్బరి నూనె ప్రయోజనాలు

కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన చర్మానికి, జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. కొబ్బరి నూనెను కేవలం వంటకు మాత్రమే కాకుండా.. జుట్టు, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించొచ్చు. 
 

46

నల్ల మిరియాల వాడకం

నల్ల మిరియాలు తెలియని వారు ఉండరు. ఇవి ఒక మసాలా దినుసు. దీన్ని ఫుడ్ రుచి పెంచడానికి వంటల్లో బాగా ఉపయోగిస్తాం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇది మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును దీన్ని ఉపయోగించి తెల్లని జుట్టును నల్లగా చేయొచ్చు. మీకు తెలుసా? నల్ల మిరియాలు సహజంగా మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.

ఉసిరి పొడి

ఉసిరికాయ మన ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉసిరిపొడితే తెల్ల జుట్టును తగ్గించుకోవచ్చు. వెంట్రుకలను నల్లగా నిగనిగలాడేలా చేయొచ్చు. జుట్టుకు ఉసిరి పొడిని పెట్టడం వల్ల మన జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారుతుంది. ఉసిరికాయను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. 

56

కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకును మనం ప్రతి వంటలో వేస్తుంటాం. ఈ కరివేపాకు వంటలకు మంచి వాసనను, రుచిని అందిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం..కరివేపాకును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే హెల్తీగా జుట్టు నల్లగా మారుతుంది. 
 

66

కొబ్బరి నూనె డై మేకింగ్ మెటీరియల్స్

తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు.. ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. దీనిలో టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేయండి.  అలాగే దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని, 10 నుంచి 12 కరివేపాకు రెబ్బలను వేసి బాగా కలపండి. దీన్ని తక్కువ మంటమీద 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించండి. ఇది చల్లార్చి వడకట్టి ఒక కంటైనర్ లో నిల్వ చేయండి. దీన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. 1 నుంచి 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు తలస్నానం చేసినప్పుడల్లా పెడితే మంచి ఫలితం ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Recommended image2
Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం
Recommended image3
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved