MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఇలా చేస్తే.. మేకప్ లేకున్నా చాలా అందంగా కనిపిస్తారు

ఇలా చేస్తే.. మేకప్ లేకున్నా చాలా అందంగా కనిపిస్తారు

అందంగా కనిపించాలని రకరకాల ఫేస్ క్రీమ్స్ ను, బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ మీరు కొన్ని పనులు చేస్తే మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు. అదెలా సాధ్యమంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 17 2024, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
skin care

skin care


ముఖ్యంగా ఆడవాళ్లైతే అందంగా కనిపించడంలో ఎక్కడా తగ్గరు. ఎంత ఖరీదైనా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. మేకప్ మాత్రమే మనల్ని అందంగా చేస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ మేకప్ లేకున్నా మీరు అందంగా కనిపిస్తారు. అదికూడా కొన్ని పనులను చేస్తే. అవుకు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆరోగ్యకరమైన ఆహారం 

హెల్తీ ఫుడ్ లో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం మన శరీరాన్ని మాత్రమే కాకుండా.. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మంపై నేచురల్ గ్లో ని కూడా అందిస్తుంది. 
 

36


తగినంత నిద్ర 

నిద్ర ఎక్కువ పోయినా మంచిది కాదు. తక్కువ పోయినా మంచిది కాదు. ఇది మీ ముఖంపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు సహజంగా అందంగా కనిపించాలంటే తగినంత నిద్రపోయేలా  చూసుకోండి. దీనివల్ల మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు. 

46


ప్రతిరోజూ వ్యాయామం

వ్యాయామం కేవలం మన శరీరాన్ని మాత్రమే ఫిట్ గా, హెల్తీగా ఉంచుతుంది అనుకుంటే పొరపాటే. మీరు ప్రతిరోజూ యోగా, వ్యాయామం, ధ్యానం, మార్నింగ్ వాక్ చేస్తే మీ శరీరం, మనస్సు, లోపలి నుంచి బయటినుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. దీంతో మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మీరు త్వరగా వృద్ధాప్యంలోకి రారు.

పుష్కలంగా నీరు

మన శరీరానికి తగినంత నీరు చాలా అవసరం. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా శరీరానికి చురుకుదనాన్ని తీసుకొస్తుంది. అలాగే డ్రై స్కిన్, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. 

56

శరీరం శుభ్రంగా

అందమైన, మెరిసే చర్మం పొందాలంటే మీరు మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ స్నానం చేాయలి. అలాగే ఎప్పటికప్పుడు జుట్టును కడుక్కోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా, దురద, అలెర్జీలు మొదలైన సమస్యలు రావు.

సరైన సైజు దుస్తులు 

మీ శరీరానికి అనుగుణంగా సరిపోయే దుస్తులు ధరించడం వల్ల కూడా మీరు, మీ వ్యక్తిత్వం అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కూడా మీరు మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి సరైన దుస్తులు ధరించండి.

66
skin care

skin care

చర్మం, జుట్టు సంరక్షణ ముఖ్యం 

మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించాలంటే మాత్రం జుట్టు, చర్మం రెండింటికీ అదనపు సంరక్షణ అవసరం. దీని కోసం మీరు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. అలాగే జుట్టును దువ్వాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
సౌందర్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maang Tikka: పెళ్లి కూతుళ్లకు అదిరిపోయే పాపిడి బిళ్లలు.. చూసేయండి
Recommended image2
Women in 40's: 40 దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే
Recommended image3
Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved