పీరియడ్స్ గురించి పిల్లలకు చెప్పడం ఎలా..?
ఆ మార్పులను వారు అర్థం చేసుకునేలా మీరే వారికి వివరించాలి. మార్పులు వచ్చిన తర్వాత కన్నా... రావడానికి ముందే...వారికి త్వరలో వారి శరీరంలో రాబోయే మార్పుల గురించి వివరించాలి.
periods pain
ప్రతి ఆడపిల్ల జీవితంలో పీరియడ్స్ ని ఎదుర్కోవడం చాలా కామన్. అయితే... ఈ రోజుల్లో పదేళ్ల పిల్లలు కూడా వారిలో సైకిల్స్ ప్రారంభమౌతున్నాయి. వారికి పీరియడ్స్ రావడం మొదలు కాకముందే... వాటి గురించి తల్లి వివరించాలట. ఆ విషయాన్ని ఎలా వివరించాలో నిపుణులు మనకు సూచిస్తున్నారు.
periods pain
ఆడ పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ.. వారి శరీరంలో మార్పులు రావడం సహజం. ఆ మార్పులను వారు అర్థం చేసుకునేలా మీరే వారికి వివరించాలి. మార్పులు వచ్చిన తర్వాత కన్నా... రావడానికి ముందే...వారికి త్వరలో వారి శరీరంలో రాబోయే మార్పుల గురించి వివరించాలి.
ఒక్కసారి వారికి పీరియడ్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత.. ఎలా ఉండాలి..? ఏం చేయాలి అనే విషయాలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చాలా మంది కంఫర్ట్ గా ఫీలవ్వరు. కాబట్టి.. వారికి పీరియడ్స్ రాకమేందు... ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది..? ఏం చేయాలి లాంటి విషయాలను చెప్పాలట.
ఇక పీరియడ్స్ విషయం చాలా సున్నితమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని వారికి కంగారు కంగారుగా చెప్పకూడదు. ప్రశాంతంగా.. కొంచెం సమయం తీసుకొని వివరించాలి.
పిల్లలకు పీరియడ్స్ గురించి చెప్పేటప్పుడు.. వారికి మీ ఎక్సీపీరియన్స్ కూడా చెప్పవచ్చు. సీరియస్ గా కాకుండా... అర్థమయ్యేలా చెప్పడం చాలా అవసరం.
periods health tips
అందరు పిల్లలు ఒకేలా ఉండరు. కాబట్టి... మీ పిల్లల అవసరాన్ని బట్టి... వారికి ఎప్పుడు ఈ విషయం చెప్పడం అవసరమో...తెలుసుకొని దానికి తగినట్లు చెప్పడం ముఖ్యం.
మీరు ఒక్కసారి చెప్పగానే.. పిల్లలకు ఆ విషయం అర్థంకాకపోవచ్చు. కాబట్టి... ఎక్కువ సార్లు... చాలా ఓపికగా చెప్పడం అవసరం. వారికి అర్థం చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వాలి.
ఈ విషయంలో పిల్లలకు ఏవైనా అనుమానాలు వస్తే... వారు ఎన్ని ప్రశ్నలు వేస్తే అంత మంచిది. వారికి వచ్చే డౌట్స్ ని తీర్చడం వల్ల.... వారికి ఎక్కువ అర్థమయ్యేలా చెప్పే అవకాశం ఉంటుంది.
మీరు చెప్పడానికి ముందే... పీరియడ్స్ గురించి మీ పిల్లలు కొన్ని వినే ఉంటారు. ముందు అవి తెలుసుకొని.. వాటిలో నిజమెంతో.. అబద్దం ఏంటో వివరించాలి. వారికి ఉన్న అనుమానాలను క్లియర్ చేయాలి.
పీరియడ్స్ విషయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హైజెనిక్ గా ఉండటం ఎంత అవసరమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.