ఇదొక్కటి చేస్తే.. పిల్లల నెత్తిలో పేలు ఉండనే ఉండవు..
చాలా మంది పిల్లల నెత్తిలో పేలు విపరీతంగా ఉంటాయి. ఇక వీళ్లకు నీట్ గా జడ వేస్తే.. నెత్తి మొత్తం కనిపించేలా తిరుగుతుంటాయి. పేల వల్ల నెత్తిమీద పుండ్లు కూడా అవుతుంటాయి. అందుకే పేలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్కూలుకు వెళ్లే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండేలాచూసుకోవాలి. ముఖ్యంగా చాలా మంది పిల్లల తలలో పేలు విపరీతంగా అవుతుంటాయి. మీకు తెలుసా? ఈ పేలు పిల్లల తలల నుంచి పోషణను సంగ్రహిస్తాయి. అలాగే నెత్తిమీద రక్తాన్ని కూడా పీల్చుతాయి. దీనికి తోడు పేలు గుడ్లు పెట్టి తలలో పేలను రెట్టింపు చేస్తాయి. అంతేనా.. ఈ పేలు బట్టలు, దువ్వెనలు, టవల్స్, పరుపు సహాయంతో ఒకరి నుంచి మరొకరి నెత్తిమీదికి ఎక్కుతాయి. అందుకే పిల్లలు, పెద్దల తలలో ఉన్న పేలు పారిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కెమికల్ షాంపూలు
చాలా మంది పిల్లల నెత్తిలో పేలు ఎక్కువయ్యాయని కెమికల్ షాంపూలను పెట్టి తలస్నానం చేయిస్తుంటారు. కానీ ఈ కెమికల్ షాంపూలను నెత్తికి పెట్టడం వల్ల పిల్లల సున్నితమైన చర్మం, కళ్లపై చెడు ప్రభావం పడుతుంది.అందుకే వీటిని పొరపాటున కూడా ఉపయోగించకండి.
ఎఫెక్టీవ్ హోం రెమిడీలు
తలలో నుంచి పేలు పోవాలంటే సీతాఫలం గింజలను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను బ్రష్ తో పిల్లల తలకు బాగా పట్టించండి. అరగంట తర్వాత తలస్నానం చేయించండి. ఈ పేస్ట్ ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేస్తే మీ పిల్లల నెత్తిలో ఒక్క పేను కూడా ఉండదు.
lice
ఆలివ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్
ఆలివ్ ఆయిల్, టీ టీ ఆయిల్ కూడా పేలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఆలివ్ ఆయిల్ ను తీసుకుని అందులో 8 నుంచి 10 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను వేసి మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి రాత్రి మొత్తం అలాగే ఉంచండి. ఉదయం లేవగానే సన్న దువ్వెనతో జుట్టును దువ్వితే చనిపోయిన పేలు మొత్తం కింద పడతాయి.
వేప నూనె
అవును వేప నూనె కూడా నెత్తిమీద పేలు లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేప నూనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వేపనూనెను తలకు పట్టించి మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత దువ్వితే పేలన్నీ దువ్వెనకు వస్తాయి. పేల బాధ తొలగిపోతుంది.