తలలో పేలు పోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది
పొట్టి జుట్టు, పొడుగు జుట్టు అని తేడా లేకుండా చాలా మంది నెత్తిలో పేలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పేలు అస్సలు పోవని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలతో తలలో ఒక్క పేను లేకుండా చేయొచ్చు. అదెలాగంటే?
పొట్టి జుట్టు, పొడుగు జుట్టు అని తేడా లేకుండా చాలా మంది నెత్తిలో పేలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పేలు అస్సలు పోవని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలతో తలలో ఒక్క పేను లేకుండా చేయొచ్చు. అదెలాగంటే?
జుట్టు పొడుగ్గా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా మంది పొట్టి, పొడుగు జుట్టు ఉన్నవాళ్లకు తలలో విపరీతంగా పేలు ఉంటాయి. ఈ పేలు చాలా సార్లు వెంట్రుకల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇబ్బంది కలిగించడమే కాకుండా.. వీటివల్ల వెంట్రుకలకు అవసరమైన పోషకాలు కూడా అందవు.
తలలో పేలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం, నెత్తిమీద మురికి పోరుకుపోవడం వంటి వివిధ కారణాల వల్ల తలలో పేలు అవుతాయి. ఈ పేలు ఒకటి పోయి పదుల సంఖ్యలో నెత్తిమీద అవుతాయి.
ఇవి జుట్టులో ఎక్కువగా అయితే మాత్రం వీటిని లేకుండా చేయడం కష్టంగా మారుతుంది. అందుకే వీటిని నెత్తిమీద ఒక్కటి కూడా లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తలలో పేలు పోవడానికి టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె, కలబంద జెల్ అవసరమవుతాయి. ఈ మూడూ మీ జుట్టును హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి.అలాగే వెంట్రుకలకు అవసరమైన మొత్తంలో పోషణను అందించడానికి సహాయపడతాయి.
ఈ మూడింటిలో ఉండే లక్షణాలు జుట్టును మూలాల నుంచి బలంగా చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి జుట్ట పొడిబారడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే జుట్టును తిరిగి షైనీగా చేయడానికి సహాయపడతాయి.
తలలో పేలు పోవాలంటే ఏం చేయాలి?
ముందుగా మీ జుట్టు పొడవును బట్టి అందుకు సరిపోయే కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి తీసుకోండి. దీంట్లో కలబంద జెల్ ను వేసి బాగా కలపండి. ఈ రెండింటిలో 3 నుంచి 4 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను వేయండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి నెత్తికి, మొత్తం వెంట్రుకలకు, జుట్టు మూలాలకు అప్లై చేయండి.
దీన్ని జుట్టుకు ఒక 1 గంట పాటు అలాగే ఉంచండి. అయితే ఈ నూనె పెట్టుకున్నప్పుడు కళ్లకు అంటకుండా చూసుకోండి. ఇది కళ్లకు మంచిది కాదు. ఆ తర్వాత షాంపూ, కండీషనర్ తో తలస్నానం చేసి జుట్టును శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు జుట్టుకు పెడితే తలలో ఒక్క పేను కూడా ఉండదు. అలాగే ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.