MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • లావుగా ఉన్న బుగ్గలను ఎలా తగ్గించుకోవాలి?

లావుగా ఉన్న బుగ్గలను ఎలా తగ్గించుకోవాలి?

బుగ్గలు మరీ సన్నగా ఉంటే చూడటానికి అంత బాగుంటుండదు. అలా అని మరీ లావుగా ఉంటే కూడా అందం తగ్గుతుంది. కొంతమందికి బుగ్గలు మరీ ఎక్కువ లావుగా ఉంటాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 09 2024, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శరీరం సన్నగా, బుగ్గలు లావుగా ఉంటే అస్సలు అందంగా కనిపించదు. బుగ్గలు మరీ ఎక్కువ లావుగా ఉంటే కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే బుగ్గలు లావుగా ఉంటే మీరు ఎంత అందంగా ఉన్నా ఇది మీ అందాన్ని పాడుచేస్తుంది. బుగ్గలను తగ్గించుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కార్డియో వ్యాయామాలు

కార్డియో వ్యాయామాలతో సులువుగా బరువు తగ్గొచ్చు. అలాగే లావుగా ఉన్న బుగ్గలను కూడా ఈ వ్యాయామాలతో సులువుగా తగ్గించుకోచ్చు. రోజూ కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల చెంపలకున్న  కొవ్వును తగ్గించుకోవచ్చు. కార్డియో వ్యాయామాలు చాలా తక్కువ సమయంలోనే ముఖ కొవ్వును తగ్గిస్తాయి. 

36

ముఖ వ్యాయామాలు 

ముఖ వ్యాయామాలు కూడా లావుగా ఉన్న బుగ్గలను సగ్గంగా చేస్తాయి. ముఖ వ్యాయామాలు ముఖ కండరాలను టోన్ చేయడానికి సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ కొన్ని సులభమైన ముఖ వ్యాయామాలు చేస్తే బుగ్గలు సన్నబడతాయి. ఇది ముఖ కొవ్వును తగ్గిస్తుంది. 
 

46


ఫిష్ ఫేస్ ఎక్సర్ సైజ్ 

ఫిష్ ఫేస్ ఎక్సర్ సైజులతో కూడా మీరు లావుగా ఉన్న బుగ్గలను సన్నగా చేయొచ్చు. అలాగే డబుల్ చిన్ ను కూడా తగ్గిస్తుంది. దీనికోసం మీరు రోజూ కాసేపు ఫిష్ ఫేస్ ఎకర్సర్ సైజులు చేయండి.  ఈ వ్యాయామం చేయడానికి మీరు లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత బుగ్గలను లోపలికి లాగండి. లిప్స్ న ముదుకు పెట్టండి. ఈ సమయంలో పైకి చూడండి. దీన్ని రిపీట్ చేస్తూనే ఉండండి.
 

56


నీరు ఎక్కువగా తాగండి 

బుగ్గలు తగ్గించుకోవాలనుకుంటే మాత్రం నీళ్లను ఎక్కువగా తాగండి. ఎందుకంటే నీళ్లను తాగితే మీ జీవక్రియ పెరుగుగుతుంది. అలాగే బుగ్గలకున్న కొవ్వు కూడా కరిగిపోతుంది. వాటర్ సహాయంతో కూడా మీరు ముఖ కొవ్వును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. 
 

66


తక్కువ పిండి పదార్థాలు

శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది ముఖ కొవ్వును బాగా పెంచుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోండి. 

బుగ్గలను గాలితో నింపండి

బుగ్గలను గాలితో నింపి కూడా మీరు బుగ్గల సైజును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు నడుము నిటారుగా పెట్టి కూర్చోండి. వీలైనంత వరకు తలను వెనక్కు వంచి ముఖాన్ని ఆకాశం వైపు ఉంచాలి. ఇప్పుడు నోరు తెరిచి గాలిని నోటి నిండా తీసుకుని తర్వాత గాలిని బయటకు వదలండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image2
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image3
Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved