Diwali Facial: ఇంట్లో ఈ ఫేషియల్ చేసుకుంటే దీపావళికి అందంగా కనిపిస్తారు
Diwali Facial: దీపావళి పండుగ దగ్గరకు వస్తోంది. ఈ పండుగకు అందంగా కనిపించాలని ఇప్పటి నుంచే ఆడవారు ఫేషియల్ చేయించుకోవడానికి పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా పార్లర్ లాంటి అందాన్ని ఇంటి దగ్గర నుంచే పొందొచ్చు.

ఇంట్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలి
దీపావళి పండుగకు ఇంటిని శుభ్రం చేయడం, షాపింగ్ చేయడం, ఇంటికి వచ్చే అథితుల కోసం స్వీట్లను, పిండి వంటను తయారుచేయడం వంటి పనుల్లో ఆడవారు ఫుల్ బిజీగా ఉంటారు. దీంతో వారికి పార్లర్ కు వెళ్లే టైం అసలే ఉండదు. కానీ మీరు పార్లర్ కు వెళ్లి ఫేషియల్ చేయించుకోకున్నా.. దీపావళి నాడు అందంగా మెరిసిపోవచ్చు. జస్ట్ 30 నిమిషాల్లో ఇంట్లో నుంచే పార్లర్ లాంటి అందాన్ని పొందొచ్చు. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు కూడా చేయక్కర్లేదు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టెప్ 1
ఇంట్లోనే పార్లర్ లాంటి అందాన్ని పొందాలనుకుంటే ముందుగా మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం టీ స్పూన్ పచ్చి పాలను తీసుకుని అందులో చిటికెడు పసుపును వేసి కలపండి. ఇప్పుడు దీన్ని కాటర్ తో ముఖం అంతగా అప్లై చేయండి. తర్వాత చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయండి.
రెండు నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. పచ్చి పాలు మన చర్మానికి అంటుకున్న దుమ్ము, ధూళిని తొలగించడానికి సహాయపడతాయి. ఇక పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి.
స్టెప్ 2
ఇప్పుడు ముఖం మీదున్న మృత చర్మాన్ని తొలగి తొలగించాలి. ఇందుకోసం ఒక టీస్పూన్ బియ్యం పిండిని తీసుకుని అందులో అర టీస్పూన్ తేనె, కొంచెం రోజు వాటర్ ను పోసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా అప్లై చేసి మూడు నాలుగు నిమిషాలు చేతులతో మసాజ్ చేయండి.
ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. మనం ఉపయోగించిన బియ్యం పిండి నేచురల్ స్క్రబ్ గా పనిచేస్తుంది. ఇకపోతే తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. రోజ్ వాటర్ చర్మాన్ని చల్లగా ఉంచుతుంది.
స్టెప్ 3
ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల శెనగపిండిని వేయండి. దీనిలో టీ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, కొంచెం రోజ్ వాటర్ ను వేసి బాగా కలపండి. ఇది పేస్ట్ లా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్యాక్ ను ఇప్పుడు ముఖానికి, మెడకు బాగా రాయండి. 20 నిమిషాల పాటు వదిలేసి తర్వాత చేతులను తడి చేసి ముఖాన్ని మసాజ్ చేయండి.
తర్వాత శుభ్రంగా కడగండి. ఈ పేస్ట్ లోని శెనగపిండి ముఖ రంగును మెరుగుపరుస్తుంది. పసుపు ముఖానికి మంచి గ్లోను ఇస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
ముఖ సంరక్షణ అవసరం
మీరు ఈ విధంగా ఫేషియల్ చేసుకున్న తర్వాత వెంటనే ముఖానికి సబ్బును గానీ, ఫేస్ వాష్ ను గానీ అస్సలు ఉపయోగించకూడదు. ఇకపోతే ఫేషియల్ చేసుకున్న తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ ను వాడండి. ఇది చర్మాన్ని హైడ్రైట్ గా ఉంచుతుంది. దీపావళికి రెండు మూడు రోజుల ముందు ఈ ఫేషియల్ చేసుకుంటే మీరు పండుగ నాడు అందంగా కనిపిస్తారు.