MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Face Packs: ఇది రాస్తే దీపావళి నాడు మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

Face Packs: ఇది రాస్తే దీపావళి నాడు మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

Face Packs: పండుగల్లో ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని ఫేస్ ప్యాక్స్ ను వేసుకుంటే మీరు ఈ దీపావళి పండుగ నాడు అందంగా కనిపిస్తారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 11 2025, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్కిన్ కేర్ చిట్కాలు
Image Credit : Getty

స్కిన్ కేర్ చిట్కాలు

దీపావళి పండుగకు ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ పండుగల వేళ ఆడవారు అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు చేసేవారు కూడా ఉన్నారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా మీరు అందంగా మెరిసిపోవచ్చు. కొన్ని రకాల ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మీ చర్మం నేచురల్ గా కాంతివంతంగా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్
Image Credit : Getty

శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్

శెనగపిండి, పసుపు రెండింటినీ ఎప్పటినుంచో చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు.ఇవి మన ముఖ చర్మాన్ని కాంతివంతంగా, నీట్ గా చేయడానికి సహాయపడతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా సులువు.  ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో టీ స్పూన్ శెనగపిండి వేసి అందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. 

దీనిలో తగినంత రోజ్ వాటర్ ను పోసి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాలు వదిలేయండి.  తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. 

Related Articles

Related image1
Hair oil:కొబ్బరి నూనె vs ఆముదం నూనె.. ఈ రెండింటిలో జుట్టుకు ఇదే మంచిది
Related image2
బాడీలోషన్, టమాటా, నిమ్మకాయ వంటివి ముఖానికి రాస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే
36
నిమ్మరసం, తేనె ఫేస్ ప్యాక్
Image Credit : others

నిమ్మరసం, తేనె ఫేస్ ప్యాక్

నిమ్మరసం, తేనె రెండూ మన చర్మానికి మేలు చేస్తాయి. ఇవి చర్మ రంగును మెరుగుపర్చడంలో చాలా  ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి  ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె వేసి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మీ చర్మపు రంగు మెరుగుపడుతుంది. 

46
గంధం, బియ్యం పిండి ఫేస్ ప్యాక్
Image Credit : stockPhoto

గంధం, బియ్యం పిండి ఫేస్ ప్యాక్

గంధం, బియ్యం పిండి ఫేస్ ప్యాక్ కూడా ముఖానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నెలో టీ స్పూన్ బియ్యం పిండి,   1/2 స్పూన్ గంధం పొడి, 1 స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పట్టించండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఈ ప్యాక్ ను వారానికి ఒక సారి వేసుకుంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. 

56
పచ్చి పాలు, తేనె ఫేస్ ప్యాక్
Image Credit : our own

పచ్చి పాలు, తేనె ఫేస్ ప్యాక్

పచ్చిపాలు, తేనె మన చర్మానికి చేసే మేలు ఎంతో. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది.  ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల పచ్చి పాలు పోయండి. దీనిలోనే టీ స్పూన్ తేనెను వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని ముఖానికి, మెడకు రాయండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఈ ఫేస్ ప్యాక్‌ను రోజూ వాడొచ్చు.దీని వల్ల మీ ముఖం ఎప్పుడూ తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

66
గంధం, తేనె, బాదం నూనె ఫేస్ ప్యాక్
Image Credit : Freepik

గంధం, తేనె, బాదం నూనె ఫేస్ ప్యాక్

గంధం చర్మం రంగును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక గిన్నెలో టీ స్పూన్ బాదం నూనె పోసి అందులో టీ స్పూన్ తేనె, రెండుమూడు చుక్కల గంధం పొడిని వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసి 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మీ ముఖం అందంగా మెరుస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Hair oil:కొబ్బరి నూనె vs ఆముదం నూనె.. ఈ రెండింటిలో జుట్టుకు ఇదే మంచిది
Recommended image2
బాడీలోషన్, టమాటా, నిమ్మకాయ వంటివి ముఖానికి రాస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved