వంటగదిలోకి బొద్దింకలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి?
వంటింట్లో చీమలు, దోమలతో పాటుగా బొద్దికలు కూడా ఉంటుంటాయి. ఇవి వంటింట్లో అటూ ఇటూ తిరుగుతూ.. ఫుడ్ పైకి వెళుతుంటాయి. ఇలాంటి ఫుడ్ ను తింటే లేనిపోని వ్యాధులు వచ్చేప్రమాదం ఉంది. అందుకే వీటిని వంటింట్లోకి రాకుండా చూసుకోవాలి.
వంటగది ఎంత నీట్ గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ వంటింట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి వంటిళ్లు మొత్తం తిరుగుతూ ఫుడ్ పైకి కూడా వెళుతుంటాయి. ఇలాంటి ఫుడ్ ను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. బొద్దింకలను మార్కెట్ లో దొరికే రసాయన పదార్థాలతోనే వెళ్లగొట్టొచ్చు. కానీ చిన్న పిల్లలు ఉన్నచోట ఇలాంటి వాటిని వాడకపోవడమే మంచిది. నిజానికి బొద్దింకలను సహజంగా కూడా వంటింట్లో లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పరిశుభ్రత
పరిశుభ్రత లోపిస్తే కూడా బొద్దికలు ఎక్కువగా వస్తాయి. అంటే ఆహారాలు ఒలికిపోవడం లేదా అక్కడక్కడ ఫుడ్ పడితే బొద్దికలు వస్తాయి. అందుకే మీ వంటగదిని శుభ్రంగా ఉంచండి. కౌంటర్ టాప్ లను ఎప్పటికప్పుడు తుడవండి, ఫ్లోర్ ను క్లీన్ చేస్తుండండి. ఏవైనా ఆహారాలు ఒలికిపోతే వెంటనే క్లీన్ చేయండి. ముఖ్యంగా మూలలకు మురికి లేకుండా చూసుకోండి.
cockroaches
సీల్ పగుళ్లు
బొద్దింకలు చిన్నచిన్న రంధ్రాల ద్వారా కూడా ఇంట్లోకి వస్తాయి. అందుకే అవి మీ వంటగదిలోకి ప్రవేశించే ఏదైనా పగుళ్లు ఉంటే వాటిని వెంటనే మూసేయండి. కిటికీలు, తలుపులు, పైపుల చుట్టూ ఏవైనా రంద్రాలు ఉంటే వాటిని మూసేయండి. సాధారణంగా బొద్దింకలు సింక్ మూలల్లో ఎక్కువగా దాక్కుంటాయి. అందుకే ఇలాంటి వాటిపై ఓ కన్నేయండి.
సహజ వికర్షకాలు
బొద్దింకలకు కొన్ని వాసనలు అస్సలు నచ్చవు. ఆ వాసనలకు బొద్దికలతో పాటుగా ఇతర కీటకాలు అక్కడి నుంచి పారిపోతాయి. ముఖ్యంగా పిప్పరమింట్, యూకలిప్టస్ లేదా టీ ట్రీ ఆయిల్ వాసనలు బొద్దికలకు నచ్చవు. బొద్దింకలను తరిమి కొట్టడానికి కొన్ని చుక్కల ముఖ్యమైన నూనెలను స్ప్రే బాటిల్లోని పోసి నీళ్లు కలపండి. దీన్ని మీ వంటగది చుట్టూ స్ప్రిజ్ చేయండి. ఇది బొద్దింకలను దూరంగా ఉంచడమే కాకుండా మీ వంటగది తాజా వాసన వచ్చేలా చేస్తుంది.
ಒಳ್ಳೆಯದು, ಇದು ನಿಮ್ಮನ್ನು ವಿಲಕ್ಷಣಗೊಳಿಸಬಹುದು, ಆದರೆ ಅಡುಗೆಮನೆಯನ್ನು ಪ್ರತಿದಿನ ನೀರಿನಿಂದ ಸ್ವಚ್ಛಗೊಳಿಸಿದ ಅಥವಾ ಒರೆಸಿದ ನಂತರವೂ, ಈ ಜಿರಳೆಗಳು ಸಿಂಕ್, ಚರಂಡಿಗಳು ಮತ್ತು ಕ್ಯಾಬಿನೆಟ್ಗಳ ಮೂಲೆಗಳಲ್ಲಿ ಅಥವಾ ಚಪ್ಪಡಿಗಳ ಕೆಳಗೆ ಸಂತಾನೋತ್ಪತ್ತಿ ಮಾಡಬಹುದು, ಆದರೆ ಸರಿಯಾದ ವಸ್ತುಗಳನ್ನು ನೀವು ಬಳಕೆ ಮಾಡಿದರೆ ಎಲ್ಲಾ ಹೂಲ ಹುಪ್ಪಟೆ, ಜಿರಳೆಯನ್ನು ದೂರ ಓಡಿಸಬಹುದು...
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు బొద్దింకలకు తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బొద్దింకలు దాక్కునే అవకాశం ఉన్న క్యాబినెట్లు, డ్రాయర్లు, ఇతర ప్రాంతాలలో బిర్యానీ ఆకులను పెట్టండి. బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలను పారిపోయేలా చేస్తుంి.