ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకోవడం ఎలా..?
బ్యూటీ పార్లర్ వెళ్లి హెయిర్ స్పా చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే.. ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
దుమ్ము, దూలి, కాలుష్యం ఇలా కారణం ఏదైనా ఈ మధ్యకాలంలో జట్టు త్వరగా పాడైపోతోంది. దీని వల్ల జుట్టురాలిపోవడం , చుండ్రు వంటి సమస్యలు వేధిస్తాయి.
వీటి నుంచి బయటపడాలంటే.. ఎక్కువ మంది హెయిర్ స్పాను ఎంచుకుంటారు. అయితే.. బ్యూటీ పార్లర్ వెళ్లి హెయిర్ స్పా చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే.. ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
step1: ముందుగా నూనె తీసుకొని.. కుదళ్లు.. జుట్టు మొత్తం బాగా రాయాలి. ఆ తర్వాత బాగా మసాజ్ చేయాలి. ఇదే ఆయిల్ వాడాలని ఏమీ లేదు. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. తలలో రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్ గా కూడా ఉంటుంది.
step2: ఆ తర్వాత తలకి ఆవిరి పెట్టుకోవాలి. స్ట్రీమర్ తో కానీ.. ఏదైనా టవల్ తో కానీ ఆవిరి పెట్టుకోవాలి. స్ట్రీమర్ లేకుంటే.. మందపాటి టవల్ ని వేడి నీటిలో ముంచి.. ఆ నీటిని పిండేసి.. వేడి తగిలేలా.. తలకు ఆ టవల్ చుట్టుకోవాలి. దాదాపు 15 నిమిషాల పాటు తలకు ఆవిరి పెట్టుకోవాలి.
step3: ఆ తర్వాత షాంపూ చేసుకోవాలి. అది కూడా సల్ఫేట్ లేని షాంపూతో జుట్టు శుబ్రం చేసుకోవాలి. షాంపూ చేసుకోవడం వల్ల తలకు రాసుకున్న నూనె, దుమ్ము, దూలి మొత్తం పోతాయి.
step4: షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు హెయిర్ స్పా క్రీమ్ రాసుకోవాలి. మీ దగ్గర మార్కెట్లో కొన్న స్పా క్రీమ్ లేకుంటే.. ఇంట్లోనే తయారు చేసుకొని రాసుకొవచ్చు. పెరుగు, కోడిగుడ్డు, అరటి పండు, తేనె కలిసి దానిని జుట్టుకు రాసి 20 నిమిషాలపాటు ఉంచుకోవాలి.
step5: ఇక చివరగా.. జుట్టుకు రాసుకున్న హెయిర్ స్పాను నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత జుట్టును ఆరపెట్టేందుకు టవల్, డ్రయ్యర్ లాంటివి ఉపయోగించకూడదు. సహజంగా ఆరేలా చూడాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు అందంగా.. మారుతుంది. కుదుళ్లు బలంగా మారి.. జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.