టైల్స్, స్విచ్ బోర్డుకు అంటిన పెయింట్ మరకలను ఎలా పోగొట్టాలో తెలుసా?
పెయింట్ మరకలు అంత సులువుగా పోవు. వీటిని అప్పుడే క్లీన్ చేస్తేనే పోతాయి. కానీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల చాలా మంది తర్వాత క్లీన్ చేద్దాంలే అని వదిలేస్తారు. కానీ ఇవి ఒక్కసారి ఆరిపోయిన తర్వాత అస్సలు పోవు. కానీ కొన్ని చిట్కాలతో ఈ మరకలను ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
గోడలకు రకరకాల పెయింటింగ్ ను వేయిస్తుంటాం. పెయింటింగ్ మన ఇంటిని అందంగా మార్చేస్తుంది. కానీ దీనివల్ల టైల్స్, ఫ్లోర్, స్విచ్ బోర్డులపై పెయింట్ పడుతుంది. ఈ పెయింట్ ను అప్పుడు తుడిస్తేనే పోతుంది. లేదంటే ఇవి మొండిగా మారుతాయి. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ ను ఉపయోగించి మీరు ఈ పెయింట్ మరకలను గ్రౌండ్ నుంచి స్విచ్ బోర్డ్ వరకు పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మయోన్నైస్
అవును మయోన్నైస్ సహాయంతో కూడా మీరు పెయింట్ మరకలను పోగొట్టొచ్చు. పెయింట్ మరకలు కొన్ని గంటల క్రితమే పడినట్టైతే వాటిని పోగొట్టడానికి మీరు మయోన్నైస్ సహాయం తీసుకోవచ్చు. ఇవి తాజా మరకలను ఫాస్ట్ గా తొలగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా స్విచ్ బోర్డులు, టైల్స్, డోర్ హ్యాండిల్స్, లాచ్ లపై పెయింట్ మరకలను తొలగించడానికి మయోన్నైస్ ఉపయోగపడుతుంది.
మయోన్నైస్ ను తీసుకుని మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే సరిపోతుంది. మయోన్నైస్ కు నూనె కలిపి మరకలపై పెడితే పెయింట్ పూర్తిగా తొలగిపోతుంది. మయోన్నైస్ అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి. మరకలన్నీ ఈజీగా పోతాయి.
floor cleaning
నేలపై, ముఖ్యంగా టైల్స్ లేదా పాలరాతి టైల్స్ పై పెయింట్ మరకలు పాతవి అయితే వాటిని శుభ్రం చేయడానికి థిన్నర్ ను ఉపయోగించండి. థిన్నర్ ను కొంచెం పల్చగా చేసి మరకలు పడిన ప్రదేశంలో వేసి అరగంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత క్లాత్ తో రుద్దితే మరకలన్నీ తొలగిపోతాయి.