ఇత్తడి పాత్రలను ఎలా శుభ్రం చేయాలి?
ఇత్తడి పాత్రలు తొందరగా నల్లబడుతుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి ఆడవాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పాత ఇత్తడి పాత్రలు తలతల తెల్లగా మెరుస్తాయి.
మన ఇండ్లలో ఎన్నో రకాల పాత్రలను ఉపయోగిస్తుంటాం. వీటిలో ఇత్తడి, రాగి, ఉక్క పాత్రలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇత్తడి పాత్రలు చాలా తొందరగా నల్లగా మారిపోతుంటాయి. మరకలు అవుతుంటాయి. కానీ వీటిని శుభ్రం చేయడం అంత సులువైన పని కాదు. ఆడవాళ్లు ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలతో ఇత్తడి పాత్రలను చాలా తొందరగా శుభ్రం చేయొచ్చు. వీటివల్ల అవి తలతల కొత్తవాటిలా మెరిసిపోతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే?
brass
ఇత్తడి సామాగ్రి
ఇత్తడి పాత్రలు చాలా తొందరగా నల్లబడతాయి. చాలా ఇళ్లల్లో ఇత్తడితో చేసిన దేవతలు, దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. అలాగే హారతి పళ్లెం కూడా ఉంటాయి. కానీ వీటిని శుభ్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మన ఇండ్లలో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి వీటిని చాలా సులువుగా శుభ్రం చేయొచ్చు.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను వంటల్లో బాగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీన్ని క్లీనింగ్ కోసం కూడా బాగా ఉపయోగిస్తారు. బేకింగ్ సోడాను ఉపయోగించి మనం ఎన్నో వస్తువులను శుభ్రం చేయొచ్చు. మీరు ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు. బేకింగ్ సోడాతో పాత ఇత్తడి పాత్రలను సులభంగా క్లీన్ చేయొచ్చు.
బేకింగ్ సోడాతో ఎలా శుభ్రం చేయాలి?
బేకింగ్ సోడాతో కిచెన్ సింక్ తో పాటుగా పాత ఇత్తడి పాత్రలను కూడా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం 1 టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. బ్రష్ సహాయంతో ఇత్తడి పాత్రలను శుభ్రం చేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ పద్దతి. దీనిలో పాత్రలు తలతల కొత్త వాటిలా మెరిసిపోతాయి.
వెనిగర్
వెనిగర్ ను ఉపయోగించి ఇత్తడి పాత్రలు లేదా విగ్రహాల నలుపును చాలా ఈజీగా తొలగించొచ్చు. వెనిగర్ తో ఇత్తడి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. దీని కోసం ఇత్తడి పాత్రలో వెనిగర్ ను వేయండి. ఉప్పుతో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయండి. అంతే పాత్రలు కొత్తగా మెరిసిపోతాయి.
నిమ్మకాయ, ఉప్పు
నిమ్మకాయ, ఉప్పులో ఉండే గుణాలు ఇత్తడి పాత్రలను కొత్తవాటిలా మెరిసేలా చేస్తాయి. ఈ రెండు పదార్థాలతో నల్లని ఇత్తడి పాత్రలను కొత్తవాటిలా చేయొచ్చు. ఈ రెండింటితో చాలా తక్కువ సమయంలో ఇత్తడి పాత్రలు శుభ్రమవుతాయి. ఇందుకోసం నిమ్మరసంలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఇత్తడి పాత్రలో వేసి కాసేపు అలాగే ఉంచాలి. దీన్ని బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి.