చలికాలంలో కాళ్ల పగుళ్లు.. ఇదిగో పరిష్కారం..!
కనీసం నడవటానికి కూడా రానంతగా కాళ్ల పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో కాళ్ల పగుళ్ల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాలంతో సంబంధం లేకుండా కొందరికి కాళ్ల పగళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇక చలికాలం వచ్చిందంటే.. ఇవి మరింత ఎక్కువగా ఇబ్బంది పడతాయి. చాలా మంది దీనిని పెద్ద సమస్యగా చూడరు. అవే తగ్గిపోతాయిలే అని పట్టించుకోవడం మానేస్తారు.
కానీ చివరకు అదే పెద్ద సమస్యగా మారుతోంది. చివరకు కనీసం నడవటానికి కూడా రానంతగా కాళ్ల పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో కాళ్ల పగుళ్ల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేద్దామా..
1.రాత్రి పడుకోవడానికి ముందు కాళ్లకు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె రాసి మర్దనా చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
2.శుభ్రం చేసిన సాక్సులను ప్రతిరోజూ కాళ్లకు వేసుకోవాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగాలి.
3.వ్యాసిలిన్, నిమ్మరసం కలిపి.. ఆ రెండింటి మిశ్రమాన్ని కాళ్లు పగిలిన దగ్గర రాయాలి. క్రమంతప్పకుండా ఇలా చేయాలి.
4.కాళ్లు పగిలిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాసినా కూడా ప్రయోజనం ఉంటుంది. కాళ్లు ముందుగా శుభ్రం చేసుకొని తర్వాత పాదాలు తుడుచుకొని ఆ తర్వాత కలబంద గుజ్జు రాయాల్సి ఉంటుంది. అలా వారానికి ఐదు రోజులు చేస్తే ప్రయోజనం కనపడుతుంది.
5.మూడు టీస్పూన్స్ ఓట్స్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపాలి. దీనిని పాదాలకు మాస్క్ లాగా వేసి.. తర్వాత దానిమీద అల్యూమినియం ఫాయిల్ తో చుట్టాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.