MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కొబ్బరి నూనె కాదు, జుట్టుకు కొబ్బరి పాలు రాస్తే ఏమౌతుంది?

కొబ్బరి నూనె కాదు, జుట్టుకు కొబ్బరి పాలు రాస్తే ఏమౌతుంది?

 ఈ కొబ్బరి పాలు వాడితే.. జుట్టుకు మళ్లీ ప్రత్యేకంగా కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా రాదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 27 2024, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా కొబ్బరి తినడం వల్ల... చర్మ ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. ఇదే కొబ్బరి మన జుట్టు హెల్దీగా కూడా మార్చుకోవచ్చని మీకు తెలుసా?అయితే డైరెక్ట్ గా కొబ్బరి తినడం కాకుండా.. కొబ్బరి నుంచి వచ్చే పాలను వాడే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఇప్పటి వరకు జుట్టుకు కొబ్బరి నూనె రాస్తూ ఉంటాం. కానీ కొబ్బరి పాలు ఎఫ్పుడైనా రాశారా? అసలు ఈ కొబ్బరి పాలను జుట్టుకు ఎలా వాడాలి..? వాడితే దేనితో కలిపి వాడాలి? దాని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

24
coconut milk

coconut milk

కొబ్బరి పాలలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఈ రెండూ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. దానికోసం స్వచ్ఛమైన కొబ్బరిపాలను తీసుకొని తలకు మంచిగా మసాజ్ చేయాలి. దాని వల్ల.. తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ కొబ్బరి పాలలోని విటమిన్లు కూడా జుట్టుకు అందుతాయి. దీని వల్ల చాలా తక్కువ సమయంలోనే జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.
 

34
Image: Getty

Image: Getty

కేవలం తలకు కొబ్బరి పాలు మసాజ్ చేయడమే కాకుండా.. జుట్టు మొత్తానికి కూడా అప్లై చేయాలి. అప్పుడు జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అంతేకాకుండా.. స్మూత్ గా కండిషనర్ గా కూడా పని చేస్తుంది. ఈ కొబ్బరి పాలు వాడితే.. జుట్టుకు మళ్లీ ప్రత్యేకంగా కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా రాదు.

కొబ్బరి పాలు తలకు అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గంట పాటు అలానే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల.. దానిలోని పోషకాలు జుట్టుకు అందుతాయి. జుట్టు తేమగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టు మరింత మృదువుగా మారాలి అంటే.. అదే కొబ్బరి పాలలో ఒక స్పూన్ తేనె కలపాలి. లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హెయిర్ మరింత మృదువుగా, పట్టుకుచ్చులా మారుతుంది.
 

44

ఇలా అరగంట పాటు రాసి వదిలేసిన తర్వాత.. గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూ తో తలను, జుట్టు కుదుళ్లను మంచిగా షాంపూ చేయాలి. ఇలా చేయడం వల్ల.. జుట్టు మృదుత్వం కోల్పోకుండా, పట్టుకుచ్చులా కనపడుతుంది. బలంగా కూడా మారుతుంది. కావాలంటే ఈ కొబ్బరి పాలలో కలబంద గుజ్టు వేసి కూడా కలిపి జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇలా వారానికి ఒకసారి కనీసం రెండు, మూడు సార్లు చేసినా మీ జుట్టులో మార్పు మీరు చూడగలరు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image2
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Recommended image3
Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved