జుట్టు బాగా పెరగాలంటే... ఎన్ని నెలలకు ఒకసారి కత్తిరించాలి..?
రెగ్యులర్ గా ఎన్ని నెలలకు ఒకసారి జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందో , నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
జుట్టు మంచిగా పెరగాలని, ఒత్తుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ... ఒక పొడవు చేరుకున్న తర్వాత.. జుట్టు పొడవు పెరగడం ఆగిపోతుంది. దీంతో.... చాలా మందికి జుట్టు పొడవు పెరగడం లేదనే బెంగ మొదలౌతుంది. దీని కోసం ఎక్కువ మంది చేసే పని హెయిర్ కట్. రెగ్యులర్ గా హెయిర్ ని కట్ చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది అని నమ్ముతుంటారు. అందులో కొంత నిజం ఉంది. జుట్టు చివరలు చిట్లిపోయినట్లుగా ఉంటే జుట్టు అందం ఉండదు. అదే చివరలు కత్తిరించడం వల్ల.. జుట్టు అందంగా కూడా కనపడుతుంది. మళ్లీ పొడవు కూడా పెరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు.
కానీ.. రెగ్యులర్ గా ఎన్ని నెలలకు ఒకసారి జుట్టు కత్తిరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందో , నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
మీకు మీ జుట్టు ఉన్నంతలో ఒత్తుగా మంచిగా కనిపించాలి అంటే..ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు చివరలు చాలా హెల్దీగా కనపడతాయి. రెగ్యులర్ గా హెయిర్ కట్ చేయించడం వల్ల... మనకు కూడా జుట్టు పెరుగుతున్న భావన కలుగుతుంది.
మీది చాలా పొట్టిజుట్టు అనుకోండి... ప్రతి మూడు నుంచి నాలుగు వారాలకు ఒకసారి కట్చేసుకోవచ్చు. లేదు.. పొడువు జుట్టు అనుకోండి... ప్రతి నాలుగు నెలలు ఒకసారి.. కింద చివరలు కత్తిరించుకుంటే సరిపోతుంది.
జుట్టు కత్తిరించిన తర్వాత జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే... నాన్ ఫ్రిజ్జీ సీరమ్స్, సహజ నూనెలు అంటే.. ఆమ్లా, రోజ్ మేరీ, కొబ్బరి నూనె లాంటివి ఉపయోగించాలి. ఇవి.. జుట్టును చాలా స్మూత్ గా మారుస్తాయి. తలస్నానం చేయడానికి ముందు ప్రతిసారీ.. నూనె రాసుకోవడం అలవాటు చేసుకుంటే.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
కేవలం జుట్టు కత్తిరించుకోవడం వల్ల జుట్టు పెరుగుదల ఉండదు. తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల.. తలలో రక్త ప్రసరణ మంచిగా జరిగి... జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పెరగడం అనేది.. చివరల్లో ఉండదు.. తల మొదట్లో ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. దాని కోసం రెగ్యులర్ హెడ్ మసాజ్ అవసరం.
hair cutting
ఇక చాలా మంది అసలు జుట్టు కత్తిరించకపోతే.. తమ జుట్టు పొడవుగా పెరుగుతూనే ఉంటుంది అని నమ్ముతారు. కానీ.. అలా జరిగే అవకాశం చాలా తక్కువ. జుట్టు చివరలు పాడై, జుట్టు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. లేదంటే.. ఒక పొడవు తర్వాత.. జుట్టు పెరగడం ఆగిపోవచ్చు.
కొందరేమో.. తాము రెగ్యులర్ గా జుట్టు కత్తిరిస్తూనే ఉంటామని కానీ... అది మాత్రం పొడవు పెరగడం లేదు అని వాపోతూ ఉంటారు. దానికి కూడా కారణం ఉంది. మీరు సరైన ఆహారం తీసకోకపోవడం వల్ల ఇలా జరగవచ్చు. మంచి ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల, హెయిర్ కేర్ వల్ల జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది.