MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మీ మెడ నల్లగా ఉందా? అయితే ఓ సారి ఈ చిట్కాలను ట్రై చేయండి

మీ మెడ నల్లగా ఉందా? అయితే ఓ సారి ఈ చిట్కాలను ట్రై చేయండి

కొంతమందికి మెడభాగం నల్లగా ఉంటుంది. మెడ నల్లగా ఉండటానికి చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడమొక్కటే కాదు..ఊబకాయం, ఇన్సులిన్ నిరోధక  సమస్యలు కూడా కారణమేనంటున్నారు నిపుణులు. మరి నల్లని మెడ తెల్లగా కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 16 2024, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
dark neck

dark neck

ఆడవాళ్లు ముఖానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మెడకు ఇవ్వరు. అందుకే ముఖం మెరిసిపోయినా, మెడ మాత్రం నల్లగా ఉంటుంది. దీనివల్ల ఏం ధరించినా మీరు అందంగా కనిపించరు. ముఖ్యంగా మోడ్రన్ దుస్తులు వేసుకోవాలనుకుంటే మెడ భాగం నల్లగా ఉండకూడదు. ముఖం రంగు ఒకలా, మెడ రంగు మరొకలా ఉంటే అస్సలు అందంగా అనిపించదు. కాబట్టి మెడ నలుపును పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. 

26
dark neck

dark neck

మెడ నల్లగా కావడానికి కారణాలు

మొఖం కలర్ ఒకలా, మెడ కలర్ ఒకలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆడవాళ్లలో హార్మోన్ల మార్పుల వల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడుచేస్తుంది. అందుకు మెడ నలుపు రంగును పోగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

36
dark neck

dark neck

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను మెడపై నలును వదిలించుకోవడానికి  ఉపయోగించొచ్చు. ఇందుకోసం కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి మెడభాగంలో అప్లై చేయండి. తర్వాత వేళ్లతో తేలికగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేస్తుంటే ముదురు రంగు తగ్గడం మొదలవుతుంది. 
 

46

చింతపండు, పెరుగు

చింతపండు, పెరుగుతో కూడా మెడ భాగాన్ని మొఖంలా అందంగా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం చింతపండును వేడినీటిలో నానబెట్టాలి. దీన్ని గుజ్జు తీసి అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, వేసి బాగా కలపాలి. దీన్ని నల్లగా ఉన్న మెడభాగంలో అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. చింతపండులోని ఆల్ఫా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ గుణాలు మెడపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.

56

మెడపై ఉన్న నలుపు పోవాలంటే నారింజ తొక్క, పాలు కలిపి గ్రైండ్ చేసి అప్లై చేయండి. నారింజ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెడ నల్లబడటానికి కారణమయ్యే టైరోసిన్ సమ్మేళనాలతో పోరాడతాయి.

అలాగే కలబంద గుజ్జులో పంచదార, పాలు కలిపి మెడకు స్క్రబ్ చేయండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెడను తెల్లగా చేయడానికి సహాయపడతాయి. 
 

66

అలాగే నిమ్మకాయ, కొబ్బరినూనెతో బేకింగ్ సోడాను స్క్రబ్ చేయడం వల్ల కూడా మెడభాగం నలుపు తొలగిపోతుంది. బేకింగ్ సోడాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు
Recommended image2
Rashmika: బంగారం కాదు.. పెళ్లికి రష్మిక ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?
Recommended image3
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved