MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య చాలా మంది ఆడవారికి వస్తుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు యాంటీ బయోటిక్స్ తీసుకున్నా.. అంత తొందరగా తగ్గదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2023, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) అనేది మహిళలను ప్రభావితం చేసే ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ సమస్య మొత్తం మహిళల్లో 25% మందిని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ సమస్యను ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు. అయితే ఇది అంత ప్రమాదకరమేమీ కాదు. కానీ దీనివల్ల ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలన్న కోరిక పుడుతుంది. దీనివల్ల తరచుగా మూత్రం వస్తుంది. అది కూడా కొద్దికొద్దిగా. ఈ  మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రం ఘాటు వాసన, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే యుటిఐ ఉన్నవారు యాంటీ బయాటిక్స్ ను వాడుతారు. ఈ యాంటీ బయాటిక్స్ ఈ సమస్య పెరగకుండా ఆపుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా సంక్రమణకు చికిత్స చేయడానికి సహాయపడగలిగినప్పటికీ.. వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. యుటిఐ సమస్యను తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ ను వాడటం వల్ల దద్దుర్లు, మైకము, వికారం, విరేచనాలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయని సీడీసీ హెచ్చరిస్తోంది. అంతేకాదు యాంటీబయాటిక్-రెసిస్టెంట్ యుటిఐ అభివృద్ధి చెందే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..  
 

37
urinary tract infection

urinary tract infection

నీటిని పుష్కలంగా తాగాలి

ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. అయితే వాటర్ యుటీఐని నివారించడానికి, చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది. వాటర్ మూత్రాన్ని పల్చగా చేస్తుంది. అంతేకాదు ఎక్కువ సార్లు మూత్రమూసర్జన అయ్యేలా చేసి సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
 

47
urinary infection

urinary infection

క్రాన్ బెర్రీలు

దీనిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. కొన్ని అధ్యయనాలు మాత్రం తియ్యని క్రాన్బెర్రీ రసం, క్రాన్బెర్రీ సప్లిమెంట్స్ లేదా ఎండిన క్రాన్బెర్రీస్ లు యుటీఐల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. క్రాన్బెర్రీస్ లో పీఏసీలు ఉండటమే దీనికి కారణం. ఇది మీ మూత్ర మార్గం పొరకు బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తుంది.
 

57
urinary infection

urinary infection

ప్రోబయోటిక్స్ 

ప్రోబయోటిక్స్ మన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. యుటీఐలను పూర్తిగా తగ్గించడానికి, నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఎందుకంటే అవి హానికరమైన బ్యాక్టీరియాను సహాయక బ్యాక్టీరియాతో భర్తీ చేస్తాయి.
 

67
Urinary Infection

Urinary Infection

విటమిన్ సి

విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. విటమిన్ సి అనారోగ్యాలను నివారించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి మీ మూత్రాన్ని మరింత ఆమ్లంగా మారుస్తుంది. ఇది యుటీఐలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండు, కివి, రెడ్ బెల్ పెప్పర్ వంటి ఆహారాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 
 

77

మూత్రాన్ని ఆపకూడదు 

యుటీఐ సమస్య ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితిలో  మూత్రాన్ని పట్టి ఉంచకూడదు. మూత్రం పోయడంలో అసౌకర్యంగా అనిపించినప్పటికీ.. అవసరమైనప్పుడు మీరు ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలి. మూత్రాన్ని ఆపితే బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే సంక్రమణను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే మీ మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ ఉండండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved