MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ పెయిన్ ను ఎలా తగ్గించుకోవాలి?

హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ పెయిన్ ను ఎలా తగ్గించుకోవాలి?

కొంతమందికి బ్లీడింగ్ హెవీగా కావడంతో పాటుగా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటుంది. ఈ కడుపు నొప్పిని భరించడం చాలా కష్టం. అయితే కొన్నిచిట్కాలను పాటిస్తే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 14 2024, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పీరియడ్స్ అనేది  స్త్రీ యొక్క పునరుత్పత్తిలో సాధారణ విషయం. అయినప్పటికీ..  ఇది కొన్నిసార్లు అసౌకర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా హెవీ బ్లీడింగ్, భరించలేని కడుపు నొప్పి వచ్చినప్పుడు. కొన్ని సందర్భాల్లో సాధారణం కంటే ఏడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటుంది. దీనిని మెనోరాగియా అంటారు. ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హెవీ పీరియడ్స్ కు కారణమేంటి?

హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడప్పుడు ఇలా అవుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు హెచ్చుతగ్గులను లోనైనప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు అవుతాయి.ఈ హార్మోన్ల మార్పులు గర్భాశయ గోడ మందాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఇది ఎక్కువ రోజులు పీరియడ్స్ అయ్యేలా చేస్తుంది.  పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. 
 

37

పునరుత్పత్తి మార్గ సంక్రమణ

పీఐడీ అనేది ఆడ పునరుత్పత్తి అవయవాల సంక్రమణ. ఇది ఎక్కువగా క్లామిడియా లేదా గోనేరియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధుల వల్లే వస్తుంది. ఇది ఇతర లక్షణాలతో పాటుగా హెవీ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణమవుతుంది. 

గర్భాశయ ఫైబ్రాయిడ్లు

ఫైబ్రాయిడ్లు అంటే గడ్డలు లేదా కణితులు. ఇవి గర్భాశయంలో పెరుగుతాయి. కానీ క్యాన్సర్ గడ్డలు కాదు. ఇవి కూడా హెవీ లేదా చాలా కాలం పీరియడ్స్ కు కారణమవుతాయి. 
 

47

పీసీఓఎస్

పీసీఓఎస్ అనేది హార్మోన్ల రుగ్మత. ఇది అండాశయ తిత్తులు, బరువు పెరగడం,అధిక జుట్టు పెరుగుదల వంటి  లక్షణాలను చూపిస్తుంది. అలాగే ఇది కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా అధిక రక్తస్రావానికి కారణమవుతుంది. 
 

57

హెవీ బ్లీడింగ్ కు బెస్ట్ చిట్కాలు

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల బ్లీడింగ్ చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ అలసటను, తలనొప్పి, తిమ్మిరి వంటి లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఫిల్టర్ చేయని, ముడి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలిపి తాగండి. 
 

67

పుష్కలంగా నీళ్లు తాగాలి

అధిక రక్తస్రావం ఒంట్లో రక్త పరిమాణాన్ని తగ్గిస్తుంది.  అయితే దీనిని మీరు రోజుకు 5 నుండి 7 కప్పుల అదనపు కప్పుల నీటిని తాగడం వల్ల సెట్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.  మీ శరీరం అదనపు ద్రవ అవసరాలను తీర్చడానికి ఎలక్ట్రోలైట్లను నీటిలో కలిపి తీసుకోవాలి. 

అల్లం నీరు

అల్లం నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే హెవీ బ్లీడింగ్ ఆగిపోతుంది. హెవీ బ్లీడింగ్ కు అల్లం నీరు బెస్ట్ హోం రెమెడీ. అల్లాన్ని పచ్చిగా నానబెట్టొచ్చు లేదా టీలో మరిగించి తాగొచ్చు. 
 

77


సోంపు గింజలు

సోంపు గింజల్లో ఎంమెనాగోగ్ అనే రసాయనం ఉంటుంది. ఇది తిమ్మిరి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అధిక రుతుస్రావానికి సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఇది పీరియడ్ నొప్పిని తగ్గిస్తుంది. సోంపు గింజలను కొన్ని నీటిలో పోసి, రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved