డార్క్ సర్కిల్స్ సమస్యా..? ఈ చిన్ని చిట్కాతో పొగొట్టేయచ్చు..!
కోడిగుడ్డు తెల్లసొనలో కలబంద గుజ్జు కలిపి కంటిచుట్టూ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ తోపాటు.. ముఖంపై బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి.
డార్క్ సర్కిల్స్... ఈ మధ్యకాలంలో అందరినీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి. ఒక్కపూట సరిగా నిద్రలేకపోతే చాలు.. తెల్లారేసరికి కంటిచుట్టూ నల్లటి వలయం ఏర్పడుతుంది. దాని వల్ల ముఖంలోని అందమంతా పోతుంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే చాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కా ఏంటో మనమూ ఓసారి చూసేద్దాం..
డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రదేశంలో.. కోడిగుడ్డు తెల్ల సొన రాయాలి. ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు రిపీట్ చేస్తే.. సమస్య తగ్గుతుంది.
కోడిగుడ్డు తెల్లసొనలో కలబంద గుజ్జు కలిపి కంటిచుట్టూ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ తోపాటు.. ముఖంపై బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి.
కొద్దిగా తేనెలో నిమ్మరసం కలిపి కంటికింద రాయాలి. ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముడతలు కూడా తగ్గుతాయి. డార్క్ సర్కిల్స్ కూడా మాయమౌతాయి,
రెండు స్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికీ, కంటి చుట్టూ రాయాలి. ఇది కూడా సమస్యను తగ్గిస్తుంది.
టమాట గుజ్జు ముఖానికి, మెడకు కంటి చుట్టూ రాయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్, ముడతుల తగ్గుతాయి. ఇది వారానికి కనీసం మూడు సార్లు అయినా చేయాలి. ఈ టిప్స్ ఫాలో అయితే.. చాలు. మీ ముఖం మీద డార్క్ సర్కిల్స్ కచ్చితంగా మాయం అవుతాయి.