మడమల పగుళ్లు తగ్గాలంటే ఏం చేయాలి?
మడమలు ఎన్నో కారణాల వల్ల పగళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల నుంచి చాలా సార్లు రక్తం కూడా కారుతుంటుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఈ పగుళ్లు మటుమాయం అవుతాయి. అవేంటంటే?
cracked heels
మడమల పగుళ్లు ఒక సర్వ సాధారణ సమస్య. ఇది మడమల నొప్పిని కలిగించడమే కాకుండా.. కొన్ని కొన్ని సార్లు పాదాన్ని నేలపై పెట్టనీయదు. ముఖ్యంగా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. మడమలపై చర్మం పొడిగా, గట్టిగా అయితే పగుళ్లు ఏర్పడతాయి.
మీరు గనుక జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఈ పగుళ్లు మరింత ఎక్కువ అవుతాయి. ఇది తట్టుకోలేని నొప్పిని కలిగించడం నొప్పి లేదా సంక్రమణకు దారితీస్తుంది. అయితే ఈ మడమల పగుళ్లను సహజంగా నయం చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి.
Cracked Heels
ఫుట్ స్క్రబ్
మడమల పగుళ్లు తగ్గాలంటే మీరు ఫుట్ స్క్రబ్ ను ఖచ్చితంగా వాడాలి. ఇది పగిలిన మడమలను మృదువుగా చేయడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు పాదాలను నానబెట్టి రుద్దాలి. దీన్ని ఎలా చేయాలంటే?
ఒక చిన్న బకెట్ లో గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీంట్లో కొన్ని చుక్కల లిక్విడ్ సబ్బును వేయండి. ఇందులో మీ పాదాలను 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టండి.
డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్బర్ ను వాడండి. ఆ తర్వాత పాదాలను కడిగి మెత్తని టవల్ తో తుడిచి ఆరబెట్టండి. దీన్ని నిద్రపోవడానికి ముందు ప్రతిరోజూ చేస్తే మడమల పగుళ్లు తొందరగా తగ్గిపోతాయి.
కొబ్బరి నూనెతో మాయిశ్చరైజ్
కొబ్బరి నూనె ఒక మంచి నేచురల్ మాయిశ్చరైజర్. ఇది పాదాల డ్రైనెస్ ను తగ్గిస్తుంది. ఇది పగుళ్ల చర్మానికి మంచి మెసిడిన్ లా పనిచేస్తుంది.
కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పగిలిన మడమలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇందుకోసం పాదాలను కడిగిన తర్వాత కొబ్బరినూనెను మడమలకు పట్టించి మసాజ్ చేయండి.
పగుళ్లకు ఈ నూనె బాగా పట్టి, అది పనిచేయాలంటే మాత్రం మీరు రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనెను పెట్టి కాటన్ సాక్సులు వేసుకోండి. గట్టిగా ఉండే చర్మాన్ని మృదువుగా చేయడానికి ఈ రాత్రిపూట ఇలా చేస్తే పాదాల చర్మం మెత్తగా అవుతుంది. తేమగా ఉంటుంది. పగుళ్లు కూడా తగ్గిపోతాయి.
హనీ ఫుట్ మాస్క్
పగిలిన మడమలను తగ్గించడానికి తేనె కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది మడమల చర్మాన్ని తేమగా చేస్తుంది. పగిలిన మడమలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా అప్లై చేయాలంటే?
ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీంట్లో అరకప్పు తేనెను వేయండి. ఈ వాటర్ లో మీ పాదాలను 15–20 నిమిషాల పాటు నానబెట్టండి.
ఈ తేనె మడమల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆ తర్వాత మడమలను సున్నితంగా రుద్ది కడగండి. ఈ పద్దతిని వారానికి కొన్ని సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద జెల్
కలబంద జెల్ మడమల పగుళ్లను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ మడమలను క్లీన్ చేసి బాగా ఆరబెట్టండి. ఆ తర్వాత ఫ్రెష్ కలబంద జెల్ ను తీసుకుని దీన్ని మందంగా మడమలకు అప్లై చేయండి. ఈ జెల్ రాత్రంతా పనిచేయడానికి మీ పాదాలను సాక్సులు వేసుకోండి. దీన్ని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.
ఆలివ్ ఆయిల్ మసాజ్
ఆలివ్ ఆయిల్ కూడా మడమల పగుళ్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి పాదాలకు అవసరమైన పోషకాలను అందించి పగుళ్లను తగ్గించడానికి సహాయపడతాయి.
ఇందుకోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను వేడి చేసి మడమలకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. దీనిని సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి. లేదా రాత్రంతా అలాగే ఉంచండి. మీ మడమల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి దీన్ని ప్రతిరోజూ పెట్టండి.