Hair Care: మెంతుల్లో ఈ ఆకుల పొడి కలిపి రాస్తే.. జుట్టు రాలడం వారంలో తగ్గుతుంది..!
Hair Care: పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడంతో పాటు , మంచి హెయిర్ కేర్ రొటీన్ కూడా ఫాలో అయితే కచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు.. జుట్టు రాలే సమస్య కూడా ఉండదు.

జుట్టు రాలడం తగ్గాలంటే...
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరిని పలకరించినా.. ఒకప్పుడు తమకు చాలా జుట్టు ఉండేదని... ఇప్పుడు మొత్తం వూడిపోతుందని ఫీలౌతున్నారు. దాని కోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి నూనె, ప్రతి షాంపూ వాడేస్తూ ఉంటారు. వేల రూపాయలు ఖర్చు చేసి ఆ షాంపూలు వాడినా ప్రయోజనం ఉండటం లేదు. పైగా, మరింత ఎక్కువగా రాలిపోతోంది. దీనికి తోడు మధ్య మధ్యలో వచ్చే జ్వరాలు, ఆరోగ్య సమస్యలు కూడా హెయిర్ డ్యామేజ్ కి కారణం అవుతున్నాయి. అయితే.. సహజంగా మనకు లభించే పదార్థాలతో ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని, దానిని వాడితే మాత్రం ఈ హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టొచ్చు. మరి, ఆ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దామా....
మెంతులు, మునగాకు హెయిర్ ప్యాక్
మెంతులు, మునగాకు, కలబంద వీటన్నింటినీ.. హెయిర్ కేర్ లో భాగంగా వాడుతూనే ఉన్నాం. అయితే... ఈ మూడింటి మిశ్రమంగా ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసి జుట్టుకు అప్లై చేస్తే మాత్రం... మీ జుట్టు అందంగా మారడం పక్కా. వారానికి రెండు సార్లు దీనిని మీ జుట్టు మొత్తానికి అప్లై చేస్తే.... 7 రోజుల్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం మీరు చూస్తారు.
హెయిర్ ప్యాక్ తయారీ
ఈ హెయిర్ ప్యాక్ కోసం... ఒక కప్పు నీటిలో కొన్ని మెంతులు వేసి రాత్రంతా నానపెట్టాలి. దీనికంటే ముందే... మునగాకులను తెచ్చి కొద్దిగా వడపడే వరకు పక్కన పెట్టుకోవాలి. రెండు రోజులు పక్కన పెట్టేస్తే... ఆకులు ఎండినట్లుగా అవుతాయి. అపపుడు దానిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని... నానపెట్టిన మెంతుల్లో వేసి.. అందులోనే కలబంద గుజ్జు కూడా వేసి...మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి. తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మొత్తం రాయాలి.
ఈ హెయిర్ ప్యాక్ తో ఉపయోగాలు....
ఈ హెయిర్ ప్యాక్ లో ఉపయోగించే పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మెంతులు శరీర వేడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి, జుట్టు రాలడాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు.. జుట్టు మృదువుగా, మెరిసేలా కనపడటానికి కూడా సహాయపడతాయి. ఇక.. మునగాకు విషయానికి వస్తే.. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, సి వంటి విటమిన్లు ఉన్నాయి. ఇవన్నీ.. జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. కలబంద జుట్టును పొడిబారకుండా, ఎండిపోయినట్లు కనపడకుండా, మృదువుగా కనిపించేలా చేస్తుంది. వీటన్నింటినీ కలిపి తయారు చేసే ఈ హెయిర్ మాస్క్ కూడా జుట్టు ను అందంగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం.. కనీసం నెల రోజులు అయినా ప్రయత్నించాలి.