జుట్టు పొడుగ్గా ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేయొద్దు..
పొడవాటి జుట్టున్న వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలాసార్లు మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లను చేస్తుంటాం. వీటివల్ల మీ ఎంత పొడుగ్గా ఉన్నా అందంగా అస్సలు కనిపించదు.
ఆడవాళ్లకు పొడవాటి జుట్టు అంటే చాలా చాలా ఇష్టం. పొడవాటి జుట్టు అందంగా కనిపిస్తుంది. కానీ దీనిని సంరక్షించడం అంత సులభం కాదు. జుట్టు పెరుగుదల బాగున్నా, ఆరోగ్యంగా ఉన్నా.. సంరక్షణ లోపిస్తే మాత్రం మీ జుట్టు దెబ్బతినడం ఖాయం. ముఖ్యంగా పొడవాటి జుట్టున్న వాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది ఈ విషయాలనేమీ పట్టించుకోకుండా ఉంటారు. అలాగే జుట్టు ఆరోగ్యం గురించి కూడా దృష్టి పెట్టరు. దీనివల్లే మీ జుట్టు ఎంత పొడుగ్గా ఉన్నా.. అందంగా కనిపించదు. అందుకే పొడవాటి జుట్టున్న వాళ్లు ఏం తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అన్ని సమయాల్లో ఫోల్డింగ్..
మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో.. మన జుట్టుకు కూడా అంతే అవసరం. ఒకవేళ మీరు మీ జుట్టు టైట్ గా ఉండే పోనీటైల్ లేదా బన్ ఉంచడం వల్ల మీ పొడవాటా జుట్టుకు ఏం కాదనుకుంటే పొరపాటే. ఇది కూడా మీ జుట్టును దెబ్బతీస్తుంది. టైట్ పోనీటెయిల్ వేసుకుంటే మీ జుట్టుకు ఆక్సిజన్ సరైన మొత్తంలో అందదు. అలాగే మీ తల కూడా బరువుగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేయదు. కానీ జుట్టు తెగిపోవడం మొదలవుతుంది.
అంతేకాదు జుట్టును ఎప్పుడూ ఓపెన్ గా ఉంచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే జుట్టును ఎప్పుడూ ఫ్రీగా వదిలేస్తే జుట్టు త్వరగా చిక్కులుపడుతుంది. దీంతో మీజుట్టు తెగిపోతుంది. అలాగే ఓపెన్ హెయిర్ లో వాల్యూమ్ బాగా ఉండదు. దీంతో జుట్టు చాలా పల్చగా కనిపిస్తుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు జుట్టును మడతపెట్టి, వదులుగా వదిలేయండి.
జుట్టు కత్తిరించకపోవడం
పొడవాటి జుట్టు కావాలనే కోరికతో కొందరు ఆడవారు జుట్టును అస్సలు కట్ చేయరు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే జుట్టును కట్ చేయకపోవడం వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాగే జుట్టు చిక్కులు ఎక్కువగా పడుతుంది. అందుకే ప్రతి 3 నెలలకోసారి హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. అలాగే జుట్టు చివర్లు చీలిపోతే జుట్టుకు ప్రోటీన్ ట్రీట్మెంట్ ఇవ్వండి. జుట్టులో ప్రోటీన్ లోపం వల్ల అవి పొడిబారి నిర్జీవంగా మారతాయి.
జుట్టును దువ్వుకపోవడం
చాలా మంది ప్రతిరోజూ పొడుగ్గా ఉన్న జుట్టును దువ్వుకోవడంలో ఇబ్బంది పడతారు. దీంతో చాలా మంది జుట్టును దువ్వడమే మానేస్తారు. నిజమేంటంటే.. జుట్టున8ు దువ్వకపోవడం వల్ల చిక్కులు బాగా పడతాయి. ఆ తర్వాత జుట్టు తెగిపోతుంది. నిపుణుల ప్రకారం..జుట్టును దువ్వుకోవడం ఒక వ్యాయామం. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ బాగుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.
జుట్టును సరిగా శుభ్రం చేయకపోవడం
జుట్టు పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా.. వారానికి కనీసం 2 సార్లు తలస్నానం చేయాలి. ఎప్పుడూ తేలికపాటి, రసాయనాలు లేని షాంపూతోనే జుట్టును వాష్ చేయాలి. జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా కాటన్ క్లాత్ తో జుట్టును కవర్ చేసుకోవాలి. దీనివల్ల మీ నెత్తిమీద మురికి పేరుకుపోదు. తలకు చెమట పడితే రోజుకు ఒకసారి ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. ఇది చాలా మంచి హెయిర్ క్లెన్సర్. దీనిని అప్లై చేసిన తర్వాత జుట్టును కడగాల్సిన అవసరం లేదు.