Grey Hair: ఇదొక్కటి వాడండి.. మళ్లీ తెల్ల జుట్టుకు రంగు వేయాల్సిన అవసరమే రాదు..!
Grey Hair: మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ కలర్స్, డైస్ ఏవేవో పూసేస్తూ ఉంటారు. ఇవి... తెల్ల వెంట్రుకలను కవర్ చేస్తాయి కానీ... కొంతకాలం తర్వాత జుట్టు ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. అలా కాకుండా.. సహజంగా... మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు.

తెల్ల జుట్టుకు బెస్ట్ సొల్యూషన్..
30 ఏళ్లు కూడా నిండకుండానే ఈ మధ్య చాలా మందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. చిన్న వయసులోనే వయసు మళ్లిన వారిలా కనిపిస్తున్నాం అని చాలా మంది ఫీలౌతున్నారు. ఆ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు... మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ కలర్స్, డైస్ ఏవేవో పూసేస్తూ ఉంటారు. ఇవి... తెల్ల వెంట్రుకలను కవర్ చేస్తాయి కానీ... కొంతకాలం తర్వాత జుట్టు ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. అలా కాకుండా.. ఇంట్లో లభించే కొన్నింటిని జుట్టుకు రాసినా... మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి. జుట్టు ఎక్కువ డ్యామేజ్ కాదు. పైగా ఒత్తుగా, అందంగా కూడా మారుతుంది.
తెల్ల జుట్టుకు కారణాలు...
తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడంతో పాటు... ఒత్తిడి కూడా తెల్ల జుట్టుకు కారణం కావచ్చు. దీనికి తోడు... రసాయనాలు అధికంగా ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల కూడా జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. తెల్ల వెంట్రుకలు త్వరగా వచ్చేస్తాయి. అందుకే, ఇంట్లో సహజంగా లభించే ఉత్పత్తులను వాడితే... హెయిర్ డ్యామేజ్ ఉండదు. ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
తెల్ల జుట్టుకు హోం రెమిడీ....
గుప్పెడు మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు అదే నీటిలో నల్ల జీలకర్ర కూడా వేసి మరిగించాలి. అది మరిగిన తర్వాత... ఆ మిశ్రమాన్ని వడకట్టి... ఏదైనా సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ ద్రవాన్ని రెండు భాగాలుగా విభజించండి. మీకు కావాలంటే, మీరు ఒక భాగానికి కొద్దిగా షాంపూ జోడించవచ్చు. ముందుగా, మీ తలపై , జుట్టు మూలాల్లో షాంపూ కలపకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న హెర్బల్ నీటిని సున్నితంగా రుద్దండి. దానిని కాసేపు నాననివ్వండి, తర్వాత షాంపూ కలిపిన నీటిని ఉపయోగించి మీ జుట్టును బాగా కడగాలి. దీనిని కనుక రెగ్యులర్ గా.. మీ జుట్టుకు వాడితే... కొద్ది రోజులకే తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుంది. ఇవి ఇంట్లో లభించే సహజ ఉత్పత్తులు కాబట్టి.. హెయిర్ డ్యామేజ్ ఉండదు. మీ జుట్టు అందంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.