మళ్లీ తగ్గిన బంగారం ధరలు...పది గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?
మరో రెండు మూడు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసం వస్తోంది అంటే పెళ్లిళ్లు, శుభకార్యాలు మొదలయ్యాయి. మరి, శుభకార్యాలు ఉంటే కచ్చితంగా బంగారం కొనాల్సిందే.
మొన్నటిదాకా ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. ఇప్సుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం.. రీసెంట్ గా ప్రకటించిన బడ్జెట్ కారణంగా.. వీటి ధరలు తగ్గడం మొదలయ్యాయి. రెగ్యులర్ గా తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా బంగారం ధర మళ్లీ తగ్గడం గమనార్హం. మరి.. ఈ రోజు బంగారం ధర ఎంత తగ్గింది..? తులం బంగారం ధర ఎంతకు చేరుకుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం....
మరో రెండు మూడు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసం వస్తోంది అంటే పెళ్లిళ్లు, శుభకార్యాలు మొదలయ్యాయి. మరి, శుభకార్యాలు ఉంటే కచ్చితంగా బంగారం కొనాల్సిందే. ఇప్పుడు ధరలు కూడా.. తగ్గుముఖం పడుతుండటంతో.. ఇక క్యూలు కట్టి మరీ జనాలు బంగారం కొనేస్తున్నారట. మరి.. నేడు.. మార్కెట్లో బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం...
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్ నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 190గా ఉంది. నిన్నటితో పోలిస్తే అంటే.. 30జులై 2024 వ తేదీతో పోలిస్తే తులం బంగారం రూ.50 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 68, 940కి చేరుకోవడం గమనార్హం. ఇక.. విజయవాడ నగరంలో... 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.63, 190 కాగా... 24 క్యారెట్ల బంగారం ధర రూ.68, 940కి చేరుకుంది.
gold rate
ముంబయి నగరంలో...
జూలై 31న ముంబైలో బంగారం ధర పది గ్రాములకు రూ.68,820కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కేజీ వెండి ధర రూ.82,700 కి చేరుకుంది.
ఢిల్లీలో......
జూలై 31న ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.68,710 కాగా... వెండి ధర కేజీ రూ.82, 560కి చేరుకోవడం గమనార్హం.
కోల్‌కతాలో..
కోల్‌కతాలో ఈరోజు జూలై 31న 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,730/10 గ్రాములకు చేరుకోగా.. వెండి ధర కేజీ రూ.82, 590 కి చేరుకోవడం గమనార్హం..
చెన్నైలో
జూలై 31న చెన్నైలో పది గ్రాముల బంగారం ధర రూ.69,020 కాగా.. కేజీ వెండి ధర రూ.82, 940 గా ఉంది.