మన ‘బంగారు’ సింధు.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ఆమె తన ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదట. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె.. తన ఫిట్నెస్ కోసం కసరత్తులు చేయడం మొదలుపెడతారట.
కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అధరగొడుతున్నారు. ఎప్పుడూ లేనిది ఈ సారి భారత్ స్వర్ణాల పంట పండుతోంది. ఇప్పటికే చాలా క్రీడా విభాగాల్లో మన క్రీడాకారులు స్వర్ణం గెలవగా.. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా చేరింది. తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ లో స్వర్ణం గెలిచింది. అంతక ముందు వరకు ఆమె రజతానికే పరిమితం కాగా... ఈసారి మాత్రం.. స్వర్ణం సాధించింది.
pv sindhu
ఈ స్వర్ణం గెలవడానికి సింధు కృషి చాలానే ఉందని చెప్పాలి. స్వర్ణం గెలవడానికి కేవలం.. ఆమె రోజూ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు... తన ఫిట్నెస్ విషయంలోనూ చాలా కసరత్తులు చేసేది. మరి సింధు.. తన ఫిట్నెస్ ని ఏవిధంగా కాపాడుకునేది..? అందు కోసం ఎంత కష్టపడేదో ఓసారి చూద్దాం...
pv sindhu
ఎక్కడ ఉన్నా.. ఆమె తన ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదట. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె.. తన ఫిట్నెస్ కోసం కసరత్తులు చేయడం మొదలుపెడతారట.
తన ఫిట్నెస్ లో ఆమె ఎక్కువగా కార్డియోని ఎక్కువగా ఇష్టపడతారట. అందుకే.. ప్రతిరోజూ ఆమె కార్డియోతోనే తన రోజును ప్రారంభిస్తారట. అంతేకాదు.. ఆమె తన ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా తక్కువగా.. ఆమె తన డైట్ ని మిస్ చేస్తూ ఉంటారు. కానీ... ప్రతిరోజూ ఆమె తన డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
PV SINDHU
పీవీ సింధు.. తరచూ బ్లడ్ టెస్టులు చేసుకుంటూ ఉంటారట. ప్రతి రెండు నెలలకు ఒకసారి తాను అన్ని టెస్టులు చేయించుకుంటారట. ఆ రిపోర్ట్స్ ఆధారంగా... ఆమె తన డైట్ ని ఫాలో అవుతూ ఉంటారట. అవసరమైతే డైట్ ని మార్చుకుంటూ ఉంటారట.
ఆమె డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కూరగాయలు, చికెన్, రైస్ మాత్రమే తీసుకుంటారు. ఆమె జంక్ ఫుడ్, స్వీట్స్ ని పూర్తిగా దూరం పెడుతూ ఉంటారు. స్వీట్స్, ఐస్ క్రీమ్ లను ఆమె అస్సలు తీసుకోరు, చాక్లెట్స్ కి కూడా చాలా దూరంగా ఉంటారట.
కార్డియో మాత్రమే కాదు.. ఆమె ప్రతిరోజూ యోగా, స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా.. ఆమె ప్రతిరోజూ 100 నుంచి 200 వరకు పుష్ అప్స్ కచ్చితంగా చేస్తారట.