ఇలాంటి కోడళ్లకు అత్తలు ఫిదా అయిపోతారు..!
కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఈజీగా అత్తల మనసు గెలుచుకుంటారట. వీళ్లకు ఎలాంటి అత్తలు అయినా ఫిదా అయిపోవాల్సిందేనట. మరి, ఆ అమ్మాయిలు ఎవరో చూద్దామా..
అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అని చెబుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరితో ఎవరికైనా స్నేహం కుదరురుతుందేమో కానీ.. అత్తా,కోడళ్లకు మాత్రం పొత్తు కుదరదు అని చెబుతుంటారు. కానీ.. ఈ రోజుల్లో స్నేహంగా, తల్లి కూతుళ్లలా మెదిలే అత్తా కోడళ్లను కూడా మీరు చూసి ఉండొచ్చు. ఇలాంటి అరుదైన దృశ్యం లు మన కంట పడటానికి కారణం ఆ కోడళ్లు పుట్టిన తేదీల మీద ఆధారపడి ఉంటుందంటే మీరు నమ్ముతారా? న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఈజీగా అత్తల మనసు గెలుచుకుంటారట. వీళ్లకు ఎలాంటి అత్తలు అయినా ఫిదా అయిపోవాల్సిందేనట. మరి, ఆ అమ్మాయిలు ఎవరో చూద్దామా..
నెం.3 (3, 12, 21, 30)
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3 అంటే.. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తారింట్లో ప్రశంసలు పొందుతారు. ముఖ్యంగా అత్తల మనసు దోచేస్తూ ఉంటారు. అత్తల మనసు దోచడం వల్ల.. వీరికి అత్తారిల్లు స్వర్గమయం అవుతుంది.
నిజానికి, సహజంగానే ఈ 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులు. ఈ తేదీల్లో పుట్టిన వారికి గురు గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. ఫలితంగా వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇది వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో క్వాలిటీలు, వారి గుణాల కారణంగా అత్తల మనసు గెలిచేస్తారు. అత్తల మనసుకు తగినట్లు ప్రవర్తిస్తారు. వారు ఎలాంటి కోడలు కావాలని అనుకుంటారో.. అలాంటి కోడళ్లుగా వీరు ఉండగలరు. కుటుంబంలో అందరిని ప్రేమగా చూసుకోవడంలో ముందుంటారు.
అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంటికి అదృష్టం తీసుకువస్తారట. వాళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి వారి ఇంట్లో సిరి, సంపదలు పెరగడమే కాకుండా, ఇంట్లో సంతోషం పెరుగుతుంది.
అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా, సంతోషంగా ఉండటానికి హెల్ప్ అవుతారు. కుటుంబంలో సంతోషం పెంచడానికి మాత్రమే కాకుండా.. భర్త కి కూడా అదృష్టాన్ని తీసుకువస్తారు. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ చాలా చీర్ ఫుల్ గా ఉంటారు. భర్తతో, కుటుంబ సభ్యులతో గొడవలు పడే మనస్తత్వం వీరిలో పెద్దగా ఉండదు. చిన్న చిన్న గొడవలు వచ్చినా.. సర్దుకుపోయి సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తారు.