మెరిసే చర్మం కోసం ఈ నీరు తాగితే చాలు: పార్లర్‌కి కూడా వెళ్లక్కరలేదు
మీ ఇంట్లో త్వరలో భారీగా పూజ లేదా ఫంక్షన్ చేస్తున్నారా? ఇలోగా మీరు పార్లర్ చుట్టూ తిరగక్కరలేకుండా ఇంట్లో ఉండే మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునే అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన డ్రింక్స్. వీటిని మీరు వారం రోజులు కంటిన్యూగా తాగితే కచ్చితంగా మీ చర్మంలో వచ్చే గ్లో ను గుర్తిస్తారు. ఆ డ్రింక్స్ గురించి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. క్రీమ్స్ వాడతాం. ఫేషియల్ చేయించుకుంటాం. సన్స్ క్రీం ఇలా రకరకాలుగా చర్మాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. అయితే శరీరంలో లోపటి నుంచే చర్మాన్ని అందంగా చేయగలిగితే మీరు ఎటువంటి కెమికల్ క్రీములు వాడాల్సిన అవసరం లేదు. పార్లర్ కు కూడా వెళ్లక్కరలేదు. కొన్ని రకాలు నీళ్లు తాగడం ద్వారా మీ చర్మం మెరిసిపోతుంది. అది కూడా కేవలం వారం రోజుల్లో మీరు మార్పును గమనిస్తారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా నీరు ఎంత ఎక్కువ తాగితే చర్మం అంత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పొల్యూటెడ్ వాతావరణంలో కేవలం నీరు తాగితే సరిపోదు. నీరు తాగడంతో పాటు, డీటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మీరు ఏదైనా ఫంక్షన్ కు వెళ్లడానికి కనీసం వారం రోజులు టైం ఉంటే.. ఈ డీటాక్స్ వాటర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.
చాలా సింపుల్ ప్రాసెస్ లో డీటాక్స్ వాటర్ తయారు చేయవచ్చు. డీటాక్స్ వాటర్ లో రకాలు కూడా ఉన్నాయి. వాటిని ఏం వస్తువులు కావాలో, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ, నిమ్మకాయ, అల్లం, పుచ్చ కాయల ముక్కలను ఉపయోగించి డీటాక్స్ వాటర్ తయారు చేయవచ్చు. ఈ కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీకు ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తాయి. ఇవే కాకుండా పుదీనా, సెలెరీ, కొత్తిమీర వంటి ఆకుకూరలను కూడా చేర్చవచ్చు. జీలకర్ర, సోపు గింజలు, కొత్తిమీర, యాలకులు, క్యారమ్ గింజలు, దాల్చినచెక్క, లవంగం, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను కూడా జోడించవచ్చు.
తయారీ విధానం ఇలా...
ఒక గ్లాసు సీసాలో నీరు తీసుకొని 1 మీడియం సైజు దోసకాయ, నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఈ నీటిని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి రోజంతా ఈ నీటిని కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ మీ పనులు చేసుకోండి.
ఇంకో విధానం ఏంటంటే.. ఒక గ్లాసు నీటిలో అల్లం పొడి, పుదీనా ఆకులను వేసి రాత్రిపూట నానబెట్టండి. మర్నాడు ఉదయం నుంచి రోజంతా మీరు ఆ నీటిని తక్కువ తక్కువగా తాగండి. అది డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.
మరి కొన్ని రకాల డీటాక్స్ పానీయాలు..
పుచ్చ ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో రాత్రిపూట నానబెట్టండి. ఇప్పుడు మీరు ఈ నీటిని సిప్ చేసి తాగితే మీ చర్మంలో ఉండే మళినాలు, హానికర పదార్థాలు తొలగిపోవడం ప్రారంభిస్తాయి. యూరిన్, స్వెట్ ద్వారా మీ చర్మంలోని హానికర, బ్యాక్టీరియా, క్రిములు బయటకు పోతాయి. ఈ డీటాక్స్ వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, జీవక్రియను సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా జీలకర్రతో కూడా డీటాక్స్ వాటర్ తయారు చేయవచ్చు. జీలకర్రను రాత్రంతా ఓ గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.