ఈ ఫుడ్ కాంబినేషన్స్.. పీరియడ్ పెయిన్ ని ఇట్టే తగ్గించేస్తాయి..!
ఈ పిరియడ్ నొప్పి నుంచి బయటపడాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవాలట. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే... పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..
పీరియడ్స్ లో మహిళలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి మూడు రోజులు విపరీతమైన కడుపులో నొప్పి, నడుము నొప్పి భరించక తప్పడం లేదు. అయితే.. మహిళలు.. ఈ పిరియడ్ నొప్పి నుంచి బయటపడాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవాలట. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే... పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..
బనానా స్మూతీ విత్ బాదంపప్పు..!
అరటి పండు, బాదం కాంబినేషన్ తో చేసే స్మూతీ తీసుకోవడం వల్ల పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇది రుచి కూడా చాలా బాగుంటుంది.
తయారీ విధానం..
ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన అరటి పండు, 350 మిల్లీ లీటర్ల పాలు, రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ వెన్న, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, చిటికెడు దాల్చిన చెక్క పొడి.. ఈ మిశ్రమాలన్నింటినీ కలిపి.. స్మూతీ తయారు చేసుకోవాలి. పీరియడ్ సమయంలో ఈ స్మూతీ తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది కండరాల నొప్పి నుంచి సహాయం చేయడంలో ముందుంటి.
- అరటిపండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది పీరియడ్స్ క్రాంప్స్ , మొత్తం కండరాల సడలింపుకు సహాయపడుతుంది
- రక్తంలో చక్కెర స్థిరీకరణపై నాణ్యమైన దాల్చినచెక్క బాగా పనిచేస్తుంది.
- అవిసె గింజలు.. హార్మోన్ బ్యాలెన్స్‌లో ,శరీరం నుండి అదనపు ఈస్ట్రోజెన్‌ను తొలగించడంలో సహాయపడతాయి, టోటల్ ఈ కాంబినేషన్.. పీరియడ్ నొప్పి నుంచి మనకు ఉపశమనం కలిగించడంలోనూ.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ సహాయం చేస్తుంది.
రాస్ప్బెర్రీ లీఫ్ ,అల్లం టీ
టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి,
తయారీ విధానం..
ఒక గిన్నెలో ముందుగా నీటిని తీసుకోవాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిలో..రాస్పెబెర్రీస్ ఆకులు, అల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా టీ పొడి కూడా వేసి కొద్దిగా.. తీపి కోసం తేనెను కలుపుకోవచ్చు. దీనిని మరిగించి.. వడకట్టి.. తర్వాత టీ తాగాలి.
चाय में मौजूद फ्लोराइड हड्डियों को मजबूत करता है और दांतों में कीड़ा लगने से भी रोकता है।
రాస్ప్బెర్రీ ఆకు మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన మూలిక.
- అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి, ఇది ఉబ్బరం , నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది