సాయి పల్లవిలా మీ జుట్టు కూడా పొడుగ్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
నేచురల్ బ్యూటీ హీరోయిన సాయి పల్లవి జుట్టు ఎంత పొడుగ్గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్ తను నటించే ప్రతి సినిమాల్లో తన జుట్టుతోనే కనిపిస్తుంటుంది. అయితే ఈమె జుట్టు ఊడిపోకుండా అంత పొడుగ్గా ఉండటానికి సీక్రేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Actress Sai Pallavi
హీరోయిన్ సాయి పల్లవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈమె నటనతో కాదు.. నేచురల్ బ్యూటీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందులోనూ ఈమె నటించే ప్రతి సినిమాలో తన ఒరిజినల్ జుట్టులోనే కనిపిస్తుంటుంది.
సాయి పల్లవి జుట్టు ఎంత అందంగా ఉంటుందో కదా.. అందుకే ఆమె తన సినిమాల్లో తన జుట్టుతోనే కనిపిస్తుంటుంది. అవి ఇవి పెట్టడం వల్ల జుట్టు ఊడిపోదా? అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కానీ సాయి పల్లవి తన జుట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది.
అందుకే ఆమె జుట్టు ఊడిపోకుండా.. పొడుగ్గా, నల్లగా ఉంటుంది. సాయి పల్లవి లాంటి పొడవాటి జుట్టు ఉండాలన్న కోరిక చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది. కానీ దీనికోసం ఏం చేయాలో తెలియదు. అయితే కొన్ని నూనెలతో సాయి పల్లవి లాంటి జుట్టు మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కావాల్సిన పదార్థాలు
మీ జుట్టును పొడుగ్గా, నల్లగా పెరగడానికి సహాయపడటానికి కొన్ని నూనెలు బాగా సహాయపడతాయి. ఇందుకోసం 20 మిల్లీ లీటర్ల ఫిష్ ఆయిల్, 100 మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 మిల్లీలీటర్ల ఆముదం, 20 మిల్లీలీటర్ల వేప ఆకులు, నిమ్మరసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ నూనెలన్నింటినీ ఒక గిన్నెలో పోసి బాగా వేడి చేయండి. అప్పుడు వేప ఆకులు వేసి మళ్లీ బాగా వేడి చేయండి.
మీరు వేడి చేసిన ఈ నూనె మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం పిండి బాగా కలగలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు, నెత్తికి బాగా అప్లై చేయండి. తర్వాత 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి.
ఎన్ని రోజులకోసారి ఉపయోగించాలి?
మీరు ఈ నూనె వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం ఈ నూనె మిశ్రమాన్ని వారానికి కనీసం రెండు సార్లు వాడితే సరిపోతుంది. మీ జుట్టు మీరు కోరకున్నట్టుగా పెరుగుతుంది. అయితే ఈ నూనెను వారానికి నాలుగు సార్ల కంటే ఎక్కువ వాడటం మంచిది కాదు.
ఈ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ నూనె వల్ల మన జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిపుణుల ప్రకారం.. వారానికి రెండుసార్లు ఈ నూనెను జుట్టుకు పెట్టడం వల్ల మీ జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే జుట్టు మూలాలు బలంగా అవుతాయి. నెత్తిమీదున్న చుండ్రు కూడా పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ నూనె జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
ఈ నూనె క్రమం తప్పకుండా పెడితే.. మీరు నాలుగు వారాల్లోనే తేడా గమనిస్తారు. అంటే జుట్టు పొడవు, సాంద్రతలో చాలా పెరుగుదల మీకు కనిపిస్తుంది. అయితే మీ జుట్టును సరిగ్గా నిర్వహించడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. ఏదేమైనా ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.