తలకు నూనె కాదు.. నెయ్యి రాస్తే జరిగేది ఇదే..!
తలకు నూనె ఎవరైనా రాస్తారు. కానీ.. ఆ నూనె కి బదులు.. నెయ్యి రాసుకుంటే.. మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవ్వడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు.
Image: FreePik
వయసు ఎంత పెరిగినా.. తమ జుట్టు అందరికంటే అందంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజం చెప్పాలంటే.. మన జుట్టే మనకు ఓ తెలియని అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే.. అందరూ ఆ జుట్టుకోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఆ అందమైన జుట్టు పొందడం కోసం... మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఏదీ ఉండదు. ప్రస్తుతం మార్కెట్ లో సైతం చాలా రకాల హెయిర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏవేవో ఆయిల్స్, షాంపూలు దొరుకుతున్నాయి. అయితే.. వాటికి బదులు మన కిచెన్ లో లభించే స్వచ్ఛమైన నెయ్యి రాసుకోవడం వల్ల.. ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా?
Image: Getty
తలకు నూనె ఎవరైనా రాస్తారు. కానీ.. ఆ నూనె కి బదులు.. నెయ్యి రాసుకుంటే.. మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవ్వడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో.. కొవ్వు ఆమ్లాలు చాలా పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని జుట్టుకు రాయడం వల్ల.. మంచి పోషణ అందుతుంది. జుట్టుకు ఒక తెలియని మృదుత్వాన్ని అందిస్తుంది. జుట్టు బలంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
Image: Getty
అయితే.. జుట్టుకు నెయ్యి రాయమన్నారు కదా అని.. ఎలా పడితే అలా రాయకూడదు. ఈ నెయ్యిని రాయడంలో.. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు.. మీరు కోరుకున్న మృదువైన, అందమైన శిరోజాలు మీ సొంతం అవుతాయి. మరి ఆ టెక్నిక్స్ ఏంటి..? జుట్టుకు నెయ్యి ఎలా అప్లై చేస్తే.. ఎదుగుదల బాగుంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
Image: Getty
ముందుగా.. జుట్టుకు నెయ్యి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...
నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది పొడి, బలహీనమైన జుట్టును లోతుగా తేమగా ఉంచుతుంది, వాటిని మృదువైన , సిల్కీ హెయిర్ గా మారుస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్లు , మినరల్స్, ముఖ్యంగా విటమిన్ ఇ, స్కాల్ప్‌కు పోషణ , ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, తద్వారా జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గితే అంతకుమించి ఏం కావాలి. అంతేకాదు.. మీకు ఏవైనా చుండ్రు సమస్య ఉన్నా.. నెయ్యి రాయడం వల్ల.. వెంటనే తగ్గిస్తుంది. అంతేకాదు.. నెయ్యిని.. జుట్టుకు మంచిగా మసాజ్ చేయడం వల్ల, జుట్టుకు మంచి సహజమైన మెరుపు వస్తుంది. జుట్టుకుదుళ్లు బలంగా మారతాయి. కెమికల్స్, హీట్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల వచ్చే డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది.
Image: FreePik
ఇక.. జుట్టుకు నెయ్యి రాసేటప్పుడు మంచి స్వచ్ఛమైన, శుభ్రమైన నెయ్యిని ఎంచుకోవాలి. నెయ్యిని కరగపెట్టిన దానిని ఎంచుకోవడం ముఖ్యం. నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు.. దానిని కుదుళ్ల నుంచి పట్టిస్తూ.. జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. చేతులతో కాకుండా.. వేళ్ల తో కుదుళ్లకు పట్టించాలి. నెయ్యి గోరు వెచ్చగా మాత్రమే ఉండాలి. మరీ ఎక్కువ వేడిగా ఉన్నది వాడటం మంచిది కాదు.
తలకు నెయ్యి రాసిన తర్వాత.. మంచిగా తలకు ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం వల్ల.. నెయ్యి జుట్టుకు మరింత బాగా పడుతుంది. జుట్టుకు తగిణ పోషణ కూడా లభిస్తుంది. సాధారణంగా, నూనె రాసుకున్న తర్వాత, ఒకటి లేదా రెండు గంటల తర్వాత జుట్టును కడగాలి. కానీ మీరు మీ జుట్టుకు నెయ్యిని అప్లై చేస్తుంటే, రాత్రంతా అలాగే ఉంచడానికి ప్రయత్నించండి. షవర్ క్యాప్‌తో కప్పుకుని నిద్రపోవచ్చు. మరుసటి రోజు ఉదయం, ముల్తానీ మిట్టి లేదా తేలికపాటి షాంపూ సహాయంతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి.