MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇలా తొలగించండి...!

ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇలా తొలగించండి...!

కొన్ని సహజ పద్దతులతో మనం వెంట్రుకలను సులభంగా తొలగింవచ్చట. ఎలాంటి చికిత్సలు తీసుకోకుండా.. సహజంగా ముఖంపై వెంట్రుకలను ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 20 2022, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముఖంపై అవాంఛిత వెంట్రుకలు ఉండటం మహిళలు ఎవరికీ నచ్చదు. కానీ.. మనం ఎంత వద్దు అనుకున్నా కూడా.. ఈ వెంట్రుకలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని తొలగించుకునేందుకు కూడా తరచూ తంటాలు పడుతూ ఉంటాం. అయితే.. కొన్ని సహజ పద్దతులతో మనం వెంట్రుకలను సులభంగా తొలగింవచ్చట. ఎలాంటి చికిత్సలు తీసుకోకుండా.. సహజంగా ముఖంపై వెంట్రుకలను ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వోట్‌మీల్, అరటిపండు: ఓట్‌మీల్ , అరటిపండును బాగా కలిపి పేస్టులాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని స్క్రబ్బర్ గా వినియోగించాలి. ముఖంపై రాసి స్క్రబ్బింగ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల సహజంగా టోనింగ్, డెడ్ స్కిన్  తొలగించడంతో పాటు.. ముఖం మీద రోమాలను కూడా మనం తొలగించగలం. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్.. ముఖం పై వాపును కూడా నివారిస్తాయి. చర్మం అందంగా కనిపించడానికి కూడా సహాయం చేస్తుంది.

36


నిమ్మరసం, పంచదార, తేనె: నిమ్మరసం, పంచదార, తేనె ల మిశ్రమం ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి సహాయపడుతుంది.  ఈ మిశ్రమానికి కొద్దిగా నీటిని జోడించి వేడి చేయడం వల్ల.. సహజంగా ఇంట్లోనే వ్యాక్స్ లా తయారు చేసుకోవచ్చు.  దీనిని వెంట్రుకలు ఉన్న ప్రాంతంలో రాసి... స్ట్రిప్ తో తొలగించాలి.

46

బంగాళదుంపలు, పప్పులు: బంగాళాదుంప రసం, తేనె , నిమ్మరసంతో కలిపి మెత్తని పేస్టు మాదిరి చేయాలి. ఈ పేస్టును ముఖంపై వెంట్రుకలు ఉన్న ప్రాంతంలో రాయాలి. అనంతరం అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.  బంగాళాదుంప రసం ముఖంపై వెంట్రుకలు తక్కువగా కనిపించేలా చేస్తుంది.
 

56

గుడ్డులోని తెల్లసొన , మొక్కజొన్న పిండి: గుడ్డులోని తెల్లసొన , మొక్కజొన్న పిండిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయి. ఈ మాస్క్ ని ముఖానికి రాసుకొని.. ఆరిపోయిన తర్వాత నీటితో కడగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలను తొలగించవచ్చు.

66

నేరేడు పండు, తేనె: నేరేడు పండు ని తేనెతో కలిపి దట్టమైన మాస్క్‌ని తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి సర్కిల్  మాదిరి రాయాలి. అనంతరం సున్నితంగా మర్దన చేయాలి. ఇది వెంట్రుకలను తొలగించడంలోనూ సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Recommended image2
Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది?
Recommended image3
Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved