ఇవి రాస్తే గంటలోనే.. ముఖం మెరిసిపోద్ది..!
పార్లర్ అవసరం లేకుండా… పండగలు, స్పెషల్ ఈవెంట్స్ లో.. అందంగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
అమ్మాయిలు అందరికీ అందంగా మెరిసిపోవాలనే ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పండగ వచ్చింది అంటే.. ఆ రోజు మరింత అందంగా కనిపించాలి అనుకుంటారు. దాని కోసం వారు చాలా తిప్పలు పడతారు. ఎక్కువ మంది పార్లర్ ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. అయితే.. పార్లర్ అవసరం లేకుండా… పండగలు, స్పెషల్ ఈవెంట్స్ లో.. అందంగా కనిపించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
పార్లర్ కి వెళితే… ఏవేవో కెమికల్స్ ఉండే ఫేస్ ప్యాక్స్ వేస్తూ ఉంటారు. వాటి వల్ల లాంగ్ రన్ లో స్కిన్ కి జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. మనం ఇంట్లోనే కొన్ని సహజ ఉత్పత్తులతో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. సహజంగా స్కిన్ మెరుస్తుంది. అవేంటో చూద్దాం…
1.పచ్చి పాలు…
పచ్చి పాలు.. మన ముఖ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. పచ్చి పాలల్లో కాటన్ బాల్స్ వేసి.. వాటి సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. పావుగంట పాటు అలానే వదిలేసి.. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. ముఖం కాంతివంతంగా మెరుస్తూ కనపడుతుంది.
2.తేనె, నిమ్మరసం…
తేనె, నిమ్మరసం కూడా ముఖాన్ని ప్రకాశవంతం చేయడంలో బాగా పనిచేస్తాయి. నిమ్మరసంతో తేనె కలిపి ముఖం అంతా అప్లై చేయండి. ఆరిన తర్వాత, సాధారణ నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖం మెరుస్తుంది.
హైడ్రేటింగ్ ప్రైమర్
మేకప్ వేసేటప్పుడు మాయిశ్చరైజర్ ఉపయోగించడం సర్వసాధారణం. కానీ మేకప్ డైరెక్ట్ గా స్కిన్ పై అప్లై చేస్తారు. కానీ ఆ తప్పు చేయకండి. చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ప్రైమర్ వాడటం అవసరం. మీరు దానిని ఉపయోగించకపోతే, మీరు మృదువైన ఫౌండేషన్ పొందలేరు. హైడ్రేటింగ్ ప్రైమర్ వాడితే ముఖం అందంగా కనపడుతుంది.
curd face pack
పెరుగు మాస్క్
తేనె, పసుపు, నిమ్మరసం, కొబ్బరి నూనె కొద్దిగా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్ ను మీ ముఖం అంతా అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖం కడుక్కోండి. మంచి మెరుపు పొందడానికి వారానికి రెండుసార్లు ఇలా చేయండి.